యాదాద్రి నూతన ఆలయాన్ని చూసి పులకించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

యాదాద్రి నూతన ఆలయాన్ని చూసి పులకించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

Published on Feb 14, 2022 6:18 PM IST

యాదగిరిగుట్ట: ఫిబ్రవరి ; 14

‘సప్త గోపురాలు, కృష్ణ శిలల సౌందర్యాలు, అద్భుతమైన ముఖమంటపం ‘ …అడుగడుగునా యాదాద్రి మహా పుణ్యక్షేత్ర సౌందర్యాన్ని చూసిన ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పులకించిపోయారు.

తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరమపవిత్ర సంకల్పం మేరకు అసాధారణ రీతిలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ వైభవాన్ని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ భక్తి పారవశ్యంలో తేలియాడిన ఘటన యాదాద్రి ఆలయంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి గీతారెడ్డి ఆహ్వానం మేరకు విచ్చేసిన పురాణపండ శ్రీనివాస్ కు ఆలయ అధికారులు, స్థపతి , ఈ.ఓ పెర్సనల్ అసిస్టెంట్ స్వయంగా దగ్గరుండి నూతన ఆలయశోభను దర్శింపచేయడం ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి.

ఆలయ శిల్పసౌందర్యానికి ఎంతో ముగ్ధుడైన పురాణపండ శ్రీనివాస్ కి అధికారులు ద్రావిడ శిల్పనిర్మాణ శైలి విశేషాల్ని, ఆలయ నిర్మాణ ప్రణాళికల్ని, వందలమంది శిల్పుల శ్రమని ఆసక్తిగా వివరించారు.

తొలుత ఆలయానిక విచ్చేసిన పురాణపండ శ్రీనివాస్ కి బాలాలయంలో స్వామివారి దర్శనం చేయించిన అర్చకులు, అనంతరం ఆలయ ప్రాంగణంలో లాంఛనాలతో వేదాశీర్వచనం చెయ్యడం శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక కృషికి నిదర్శనంగా కనిపిస్తుంది.

తరువాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయంలో ఈ .వో గీతారెడ్డి యాదాద్రి అనుగ్రహంగా ప్రత్యేక ప్రసాదాన్ని అందించారు.

రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ మహాకార్యంతో చరిత్రలోనే బలమైన ముద్రవేశారని పురాణపండ ఆలయవర్గాలతో, పండితార్చక వర్గాలతో చెప్పడం లక్ష్మీనృసింహ కటాక్షమేమరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు