మరో రైటర్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు
Published on Oct 18, 2017 12:21 pm IST


సీమశాస్త్రి, భాయ్, పిల్లా నువ్వేలేని జీవితం, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన డైమండ్ రత్నబాబు త్వరలో దర్శకత్వం వహించబోతున్నారు. రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ అయిన వారిని మనం చాలా మందిని చూసాం. ఉదాహరణకి త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్ళు. తాజాగా రత్నబాబు కూడా అదే తరహాలో దర్శకత్వం చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. ఈ రైటర్ ఒక మంచి స్క్రిప్ట్ తో లేడి ఓరియంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ డిస్టిబ్యూటర్ ఈ సినిమా తో నిర్మాతగా మారబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కు సంభందించిన నటీనటులు ఎంపిక జరుగుతుంది. త్వరలో సినిమాను అనౌన్స్ చేయనున్నారు నిర్మాతలు. మొదటిసారి మెగాఫోన్ పట్టుకొనున్న డైమండ్ రత్నబాబు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవ్వాలని ఆశిద్దాం.

 
Like us on Facebook