బస్ డ్రైవర్ కొడుకు నుండి స్టార్ హీరోగా ఎదిగిన యశ్…కీలక విషయాలు వెల్లడి!

Published on Apr 6, 2022 10:02 pm IST

సెన్సేషన్ కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న యశ్, ఇప్పుడు కేజీఎఫ్2 తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ చిత్రం విడుదల సందర్భంగా యశ్ ప్రమోషన్స్ ను శరవేగంగా చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూ లో తను సినిమా రంగం కి రావడం పట్ల, తను కష్ట పడిన విధానం తో పాటుగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు యశ్.

తన తండ్రి బిఎంటీసి బస్ డ్రైవర్ గా పని చేసేవారు అని, తమది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, చిన్న తనం నుండే సినిమా పై ఆసక్తి ఉండేది అని అన్నారు. సినిమాల్లో నటించి ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనే వాడ్ని అంటూ చెప్పుకొచ్చారు. అయితే స్కూల్ లో జరిగే ఫ్యాన్సి మరియు డాన్స్ పోటీల్లో పాల్గొనే వాడ్ని అని తెలిపారు. అంతేకాక ఎవరైనా చదువుకునే రోజుల్లో పెద్దయ్యాక ఏం కావాలని అనుకుంటున్నావు అని అడిగితే, హీరో కావాలని అనుకుంటున్నా అంటూ ధైర్యం గా చెప్పే వాడ్ని అని అన్నారు. ఆ మాట విన్న క్లాస్ లో వాళ్ళు నవ్వుకునే వారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తానేం పట్టించుకొనే వాడ్ని కాదు అని, తప్పకుండా హీరో అవుతా అని అనుకొనే వాడ్ని అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక స్కూల్ లో తన ప్రదర్శన, ఆసక్తి చూసిన వాళ్ళు హీరో అని పిలిచేవారు అని, అలా పిలుస్తుంటే ఏదో తెలియని ఆనందం, ఏదో సాధించేశా అనే భావన కలిగేది అని అన్నారు.తల్లిదండ్రులు సినిమా అనేది మంచిది కాదు అని అనేవారు. మాట వినడం లేదని బాధపడే వారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక్క అవకాశం ఇవ్వండి సాధించి చూపిస్తా అంటూ బెంగళూరు కి వచ్చా, కొన్నేళ్ళు బ్యాక్ స్టేజ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసి, హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టా అంటూ చెప్పుకొచ్చారు. తన ఇంట్లో వొద్దు అని చెప్పిన విషయాలను వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 తో ఎవరూ ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు యశ్. ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :