గుంటూరు , కృష్ణా , నెల్లూరు లో యాత్ర మొదటిరోజు కలెక్షన్లు

Published on Feb 9, 2019 9:54 am IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం “యాత్ర” ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలై మంచి టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకొని మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రం గుంటూరు లో మొదటి రోజు 46లక్షల షేర్ వసూలు చేయగా కృష్ణా జిల్లాలో 19.16 లక్షల షేర్ ను రాబట్టింది. అలాగే నెల్లూరు లో హైర్స్ తో కలిపి 17.34 లక్షల షేర్ ను రాబట్టగా తూర్పు గోదావరి జిల్లాలో 10.40లక్షల షేర్ ను రాబట్టింది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, అనసూయ, సుహాసిని, ఆశ్రిత ముఖ్య పాత్రల్లో నటించారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :