యాత్ర ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Jan 6, 2019 9:31 am IST

ఈ ఏడాది మచ్ అవైటెడ్ బయోపిక్ గా ప్రేక్షకులముందుకు రానున్న చిత్రం ‘యాత్ర’. లెజండరీ పొలిటీషియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోమలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలోనటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ చిత్రం నుండి థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుంది. ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు.

శివ మేక సమర్పణలో 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More