మహేష్ సినిమాలో మరో యంగ్ బ్యూటీ ?

మహేష్ సినిమాలో మరో యంగ్ బ్యూటీ ?

Published on Feb 7, 2022 10:06 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ‘పెళ్లిసందD’ ఫేమ్ ‘శ్రీలీల’ ఈ సినిమాలో నటించబోతుందట. ఓ కీలక పాత్రలో ఆమె నటిస్తోందట. ఇక ఈ సినిమా షూటింగ్ ను మార్చి సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఓ ఫైట్ తో షూట్ స్టార్ట్ చేస్తారట.

ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్.

అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు