నాగచైతన్య సరసన క్రేజీ బ్యూటీ !
Published on Oct 7, 2017 1:30 pm IST


నాగచైతన్య- దర్శకుడు మారుతిల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం కోసం ఓ క్రేజీ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. వరుసగా భారీ ప్రాజెక్ట్ లని సొంతం చేసుకుంటున్న అను ఇమ్మాన్యుయేల్ ని ఈ చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఓ ఇంటర్వ్యూ లో మారుతి మాట్లాడుతూ.. ఈ చిత్రం ఎలాంటి డిస్ ఆర్డర్ కు సంబంధించినది కాదని తెలిపారు. నాగచైతన్య తొలిసారి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం లో నటించబోతున్నాడు. వివాహ వేడుక తంతు ముగిశాక నాగచైతన్య ఈ చిత్రంతో బిజీ కాబోతున్నాడు.

 
Like us on Facebook