చరణ్ కు అన్నయ్యగా నటించనున్న యంగ్ హీరో !

మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తాజాగా చేసిన ‘జయ జానకి నాయక’ మంచి విజయాన్నే సాధించింది. ఆ ప్రాజెక్ట్ తరువాత ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారం నుండి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనుంది. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు.

హీరోయిన్ స్నేహ ఇందులో చరణ్ కు వదినగా నటిస్తుండగా తమిళ హీరో ప్రశాంత్ చరణ్ అన్న పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు చరణ్ కు మరో అన్నయ్య పాత్రలో యంగ్ హీరో నవీన్ చంద్ర నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు.