కృష్ణవంశీ సినిమాలో యువహీరో కీ రోల్!

Maanas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన విలక్షణతను చాటుకొని టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ, తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ‘నక్షత్రం’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో యంగ్ హీరో మానస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘ప్రేమికుడు’, ‘కాయ్ రాజ్ కాయ్’, ‘జలక్’, ‘గ్రీన్ సిగ్నల్’ తదితర సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్, ‘నక్షత్రం’ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు తన పుట్టినరోజు జరుపుకుంటోన్న మానస్, ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నింటిలోనూ ఒక్కో సినిమాతో ఏదో ఒకరకంగా ఎదుగుతూ వచ్చానని, తన నటన మెచ్చి కృష్ణవంశీ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నానని తెలిపారు. ఇక నక్షత్రంతో పాటుగా ‘డీల్ విత్ ధనలక్ష్మి’ అనే సినిమాలో హీరోగా నటిస్తోన్న మానస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కెరీర్‌కు ఆల్ ది బెస్ట్ తెలుపుదాం.