స్పెషల్ స్టేటస్ కు మద్దత్తు ఇవ్వడం ప్రారంభించిన యంగ్ హీరోలు !
Published on Jan 23, 2017 5:15 pm IST

heros
సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళుల జల్లికట్టు ఉద్యమం లాగే అందరూ ఏకమై ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు తెలపడం ప్రారంభిస్తున్నారు.

టాలీవుడ్ యువహీరోలు నిఖిల్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ మరియు సంపూర్ణేష్ బాబు వంటి హీరోలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కు మద్దత్తు తెలుపుతున్నారు.జనవరి 26 న వైజాగ్ ఆర్కే బీచ్ లో జరగనున్న ప్రత్యేక హోదా మౌన పోరాటానికి యువహీరోలు వారి మద్దత్తుని ప్రకటించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ జనవరి 26 ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దత్తు తెలుపనున్నట్లు ప్రకటించారు.

 
Like us on Facebook