ఇంటర్వ్యూ : జ్యోతి కృష్ణ – యువన్ సహకారం మరువలేనిది
Published on Nov 28, 2017 6:07 pm IST

గోపీచంద్ తాజా చిత్రం ఆక్సిజన్. అను ఇమ్యనుల్, రాశి ఖాన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడు. గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణతో ఇంటర్వ్యూ…

ఆక్సిజన్ గురించి…

సినిమా విడుదల దగ్గర పడేకొద్ది టెన్షన్ గా ఉంది. మూవీ బాగా వచ్చింది. కచ్చితంగా హిట్ అవుతుంది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చెప్పలేను.ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తెలుగు నేటివిటి, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది.

గోపీచంద్ గురించి…

ఆక్సిజన్ సినిమా పెద్ద హీరోతో చెయ్యాలి అనుకున్నాను అందుకే గోపీచంద్ ను కలవడం జరిగింది. ఈ కథకు ఆయన పూర్తీ న్యాయం చేసాడు. ఈ సినిమా తరువాత గోపీచంద్ ఇమేజ్ మారిపోతుంది. యాక్షన్ సినిమాలు చేసిన గోపీచంద్ ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తాడు. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించిన గోపీచంద్ నటన అందరికి నచ్చుతుంది.

నటీనటుల గురించి…

ఈ సినిమాకోసం దాదాపు 15 మంది సీనియర్ ఆర్టిస్ట్స్ నటించారు. జగపతి బాబు, శరత్ కుమార్ వంటి నటులు సహకరించడం వల్ల సినిమా వేగంగా పూర్తి అయ్యింది. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం లో పెరిగాను కాబట్టి ఈ సినిమా నిర్మాణం సులభం అయ్యింది. అనుకున్న సమయంలో సినిమా పూర్తి చెయ్యగలిగాను.

యువన్ శంకర్ రాజా గురించి…

యువన్ శంకర్ రాజా ఇచ్చిన సహకారం మరువలేనిది. ఈ కథ విన్న వెంటనే ఆరు పాటలు ఇచ్చాడు. సినిమాలో అన్ని సాంగ్స్ కు స్కోప్ లేకపోవడంతో నాలుగు మాతమే ఉంచాము. ఇళయరాజా షోస్ తో యువన్ బిజీగా ఉండడంతో ఆయన నేపధ్య సంగీతం అందించలేకపోయాడు. అందుచేత చిన్న గారితో రీరికార్డింగ్ చేయించుకున్నాను.

తదుపరి సినిమాల గురించి…

ప్రస్తుతం నా ఆలోచన అంతా దర్శకత్వం పైనే ఉంది. నటుడిగా సినిమాలు చెయ్యను. నాన్న వ్యాపార భాద్యతలు నాపై ఉన్నాయి. మా బ్యానర్ లో చెయ్యబోయే సినిమాల నిర్మాణం పై పోకస్ చెయ్యాలి. ప్రస్తుతం ఆక్సిజన్ సినిమా విడుదల కోసం వెయిటింగ్. ఈ సినిమా విడుదల తరువాత కొత్త సినిమా ప్రకటిస్తా.

 
Like us on Facebook