సెప్టెంబర్లో ప్రారంభం కానున్న పవన్ – త్రివిక్రమ్ మూవీ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

బ్యాంకాక్ లో పోరాటాలు చేయనున్న ఎన్.టి.ఆర్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన రాబోయే ‘బాద్షా’ చిత్రం కోసం త్వరలో బ్యాంకాక్ వెళ్లనున్నారు. బ్యాంకాక్ లో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

తలపడనున్న రవితేజ – సల్మాన్ ఖాన్


మాస్ మహా రాజ రవితేజ మరియు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇద్దరూ త్వరలోనే ఒకరితో ఒకరు తలపడనున్నారు.

ఫిల్మ్ నగర్లో షూటింగ్ జరుపుకొంటున్న రామ్ చరణ్ సినిమా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎవడు’ చిత్రం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లోని క్విజ్నోస్ దగ్గర చిత్రీకరణ జరుపుకుంటోంది.

అల్ టైం బ్యూటీ శ్రీ దేవికి జన్మదిన శుభాకాంక్షలు


ఇప్పటికీ ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో, అమాయకత్వమైన ముఖబింబంతో మరియు అద్భుతమైన నటనతో ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న అందాల భామ శ్రీ దేవి

ఆగష్టు చివరి వారంలో రానున్న ‘శ్రీమన్నారాయణ’


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ శ్రీమనారాయణ’ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని

తమిళంలో పెద్ద చిత్రంలో నటిస్తున్న గాయత్రి


శేఖర్ కమ్ముల “హ్యాపీ డేస్” చిత్రం తో పరిచయం అయిన గాయత్రి పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో ప్రాచుర్యం పొందింది.

త్వరలోనే ఒక ఇంటివాడు కానున్న నాని


ప్రస్తుతం నాని టాలీవుడ్లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో. ఈ రోజు ఉదయం నానికి వైజాగ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఈ రోజుల్లో చిత్ర నిర్మాణ సంస్థ నుండి మరో చిత్రం


“ఈ రోజుల్లో” చిత్రం విజయం సాదించిన తరువాత ఆ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ గుడ్ సినిమా గ్రూప్ వారు మరో చిత్రాన్ని ప్రకటించారు.

నేను అలాంటి సినిమాలు తీయను : శేఖర్ కమ్ముల


శేఖర్ కమ్ముల సున్నితమైన మరియు ఎంతో వేవేకవంతమైన సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.

తన సౌందర్య రహస్యం తెలిపిన అమలా పాల్


అందానికి అందలం ఇచ్చే పరిశ్రమలలో టాలీవుడ్ ఒకటి మన పరిశ్రమలో హీరోయిన్ లు అందంగా కనపడడానికి చాలా ఎక్కువ శ్రద్ద తీసుకుంటారు.

సూర్య కిరణ్ దర్శకత్వంలో నటించనున్న తనీష్


దర్శకుడు సూర్యకిరణ్ మరియు హీరో తనిష్ త్వరలో ఒక ప్రేమ కథ చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు.

నాకు డబ్బు కన్నా కథ ముఖ్యం : తాప్సీ


ఒక సిని తారను తన పేరుతో కన్నా తను నటించిన పాత్ర పేరుతోనే జనం గుర్తు పడతారు ఈ విషయాన్ని తాప్సీ బాగా అర్ధం చేసుకున్నట్టు

విడుదలైన ‘మాస్క్’ మూవీ ఆడియో


‘రంగం’ ఫేం జీవా హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ మాస్క్’. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7

బ్రెజిల్ లో చిత్రీకరణ జరుపుకోనున్న సూర్య మాట్రాన్

సూర్య,కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మాట్రాన్” త్వరలో బ్రెజిల్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. తమిళ పరిశ్రమలో ఉన్న సమాచారం ప్రకారం బ్రెజిల్ లో

“బాద్షా” చిత్రం కోసం ప్రత్యేకంగా కష్టపడుతున్న తమన్


తమన్ ఈ ఏడాది వార్తల్లో ఎక్కువగా కనపడకపోయిన్నా తన రాబోతున్న చిత్రాల కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం అయన “బాద్షా”, ” నాయక్”, “షాడో”,

ఆ అనుభవం స్వర్గాన్ని చూసినట్టు ఉంది – తాప్సీ


చంద్రశేఖర్ యేలేటి రాబోతున్న అడ్వెంచర్ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ మొత్తం తాప్సీ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

‘అందాల రాక్షసి’ కలెక్షన్ల విషయంలో సంతోషంగా ఉన్నాను : రాజమౌళి


హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’. ఈ చిత్రం శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు

ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్


‘ఆకాశమంత’, ‘గగనం’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’.

ముంబైలో యాక్షన్ చేయనున్న వెంకీ


ఎప్పటికప్పుడు కొత్తరకమైన కథలను ఎంచుకోవడమే విక్టరీ వెంకటేష్ సక్సెస్ మంత్ర అని చెప్పుకోవచ్చు.

నా విజయాలన్నింటికీ వారే కారణం : అల్లు అర్జున్


ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులకు, దర్శకులకు మరియు నిర్మాతలకు విజయం అనేది అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంటుంది.

సెప్టెంబర్ మొదటివారంలో రానున్న ‘ఒక్కడినే’


నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

50 మంది పిల్లలతో కలిసి చిందేసిన ప్రియా ఆనంద్


ప్రస్తుతం ప్రియా ఆనంద్ ‘కో అంటే కోటి’ టీంతో కలిసి ఆ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

జర్మనీలో చిందేస్తున్న కాజల్-రవితేజ-రిచా


మాస్ మహారాజ రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సార్ ఒస్తారా’.

రాజమౌళి – సూర్య కాంబినేషన్లో సినిమా రానుందా?


అన్నీ కుదిరితే టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి మరియు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలిసి ఓ ద్విభాషా చిత్రం చెయ్యాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే చెన్నైలో సూర్యని రాజమౌళి కలవడంతో సూర్యతో సినిమా చేస్తున్నాడని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు ప్రచారం చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘నాన్ ఈ’ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాదించింది. ఈ స్టార్ డైరెక్టర్ తమిళంలో సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్యనే రాజమౌళి – సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి సినిమా చేయనున్నారు అనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ పుకార్లను రాజమౌళి కొట్టి పారేశారు. కానీ భవిష్యత్తులో సూర్యతో సినిమా చేస్తాను అనే విత్తనాన్ని మాత్రం ప్రేక్షకుల మదిలో నాటారు.

‘ నేను మరియు సూర్య సందర్భానుసారంగానే కలిశాము కానీ ఇద్దరం కలిసి పని చేయాడానికి ఆసక్తి గానే ఉన్నాము. కానీ ఒక సినిమా చేయాలంటే స్పష్టం చేసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయని’ రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సూర్యకి తెలుగు మరియు తమిళంలో మంచి మార్కెట్ ఉంది, ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాక్స్ ఆఫీసు దగ్గర కనక వర్షం కురుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా అనే దానికోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ హీరోగా ఒక సినిమా తీయడానికి కమిట్ అయ్యారు.

సమీక్ష : అందాల రాక్షసి – అందమైన విషాద ప్రేమకథ

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.75 /5
దర్శకుడు : హను రాఘపూడి
నిర్మాతలు : సాయి కొర్రపాటి
సంగీతం : రథన్
నటీనటులు : నవీన్, రాహుల్ మరియు లావణ్య

‘జులాయి’ అనే షిప్ కి త్రివిక్రమ్ గారే కెప్టెన్ : అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్తస్తుతం చాలా ఆనందంగా ఉన్నారు, దీనికి కారణం ఆయన నటించిన ‘జులాయి’ చిత్రానికి మంచి ఆదరణ లబించడమే.

ఖరారైన రామ్ చరణ్ – వినాయక్ సినిమా టైటిల్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వి.వి వినాయక్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ‘నాయక్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

జులాయి మొదటి రోజు కలెక్షన్స్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం మొదటి రోజు మన రాష్ట్రంలో సూపర్బ్ కలెక్షన్స్ సాదించింది.

నా అభిమానుల్ని మదిలో పెట్టుకొనే సినిమాలు ఒప్పుకుంటాను : మహేష్ బాబు


తన అభిమానుల్ని మదిలో పెట్టుకొని ఒక సినిమా ఒప్పుకుంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నారు.

సమీక్ష : జులాయి – స్టైలిష్ స్టార్ స్టైలిష్ ఎంటర్టైనర్

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : ఎస్. రాధాకృష్ణ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూ సూద్

రాహుల్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ : ‘అందాల రాక్షసి’ చిత్రంలో నాపాత్ర చంద్రుడిని ప్రతిబింబించేలా ఉంటుంది


రేపు విడుదల కానున్న ‘ అందాల రాక్షసి’ చిత్రంలో రాహుల్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ తో పాటు లావణ్య మరియు నవీన్ కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. రాహుల్ ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రను పోషించారు. అలాంటి రాహుల్ తో మేము ప్రత్యేకంగా ముచ్చటించాము . రాహుల్ బాగా చదువుకున్న విద్యావంతుడు, ఆహ్లాదకరమైన మనస్తత్వం మరియు తను వృత్తిని గౌరవించే విధానం ఎంతో బాగుంది . రాహుల్ మాతో పంచుకున్న విశేశాలేంటో చూసేద్దమా..

ప్రశ్న) ‘అందాల రాక్షసి’ చిత్రం పై మీకున్న అంచనాలు ఏమిటి?

జ)నాకు చాలా భారీ అంచనాలే ఉన్నాయండీ మరియు నేను చేసిన ఈ సినిమా చాలా మంచి సినిమా అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ చిత్రంలో మేము అంతా కలిసి చాలా బాగా నటించాము దీనికి గల కారణం ఏమిటంటే దర్శకుడికి ఈ సినిమా పై ఉన్న ఖచ్చితమైన ఆలోచనలు మరియు ముఖ్యంగా ఆయనకు ఏమికావాలో అనే విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నారు. నాకు ఎక్కడో చిన్న భయం ఉన్నా, సినిమా విడుదలకి దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై నమ్మకం బలపడుతోంది.

ప్రశ్న) ఈ చిత్రంలో మీరు చేసిన గౌతమ్ పాత్ర గురించి మరింత వివరించి చెప్పగలరా?

జ)అందరినీ ప్రేమిస్తూ, అందరికీ ప్రేమపంచే మనస్తత్వం కలవాడు గౌతమ్. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుడి లాంటి వాడు. చంద్రుడు ఎలాగైతే ఎప్పుడూ చల్లదనాన్ని పంచుతాడో అలాగే గౌతమ్ కూడా తన చుట్టూ ఉన్న అందరి పట్లా మంచి భావాలు కలిగి ఉండాలనే తత్వాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. గౌతమ్ పాత్ర చంద్రుడిని ప్రతిబింబించేలా ఉంటుంది. గౌతమ్ చాలా కూల్ గా ఉంటూ, ఓర్పు మరియు వినయ విధేయతలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరు చెప్పే విశేషాలను ఎంతో ఓర్పుగా వినే మనస్తత్వం మరియు చుట్టూ ఉన్న వారి మంచి కోసం ఏమన్నా చేసే స్వభావం కలవాడు. దర్శకుడు ఈ పాత్రని చాలా బాగా తీర్చిదిద్దారు మరియు నాకు గౌతమ్ పాత్రను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది, అర్థమైన తర్వాత ఎంతో సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను.

ప్రశ్న) అందాల రాక్షసి’ చిత్రంలో ఈ పాత్రకు మిమ్మల్ని ఎలా ఎంపిక చేసుకున్నారు?

జ)ఈ అవకాశం మాత్రం పూర్తిగా లక్ వల్లే వచ్చింది అని చెప్పుకోవాలి. నా స్నేహితులు నన్ను హనుకి సూచించారు ఆ తర్వాత నేను నా ఫోటోలు అతనికి పంపాను. అవి చూసిన హను నన్ను ఒకసారి వచ్చి కలవమన్నారు అప్పుడే నేను హనుని కలవడానికి హైదరాబాద్ కి వచ్చాను. నేను మొదటి సారి అతన్ని చూడగానే అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నా ఎందుకంటే అతను అంత యంగ్ గా ఆన్నారు. అతనితో కొంత సేపు మాట్లాడిన తర్వాత అతను చాలా పరిణతి చెందిన వ్యక్తి అని నాకు అర్థమైంది. అతను నన్ను, నా బాడీ లాంగ్వేజ్ చూడటానికే రమ్మన్నారు. ‘ ఒకసారి మీరు ఈ పాత్రకి సరిపోతారు అనుకుంటే మీకు నటించడం చాలా సులువుగా ఉంటుందని’ హను నాతో అన్నారు. ఫైనల్ గా గౌతమ్ పాత్రకి నేను సరిపోయాను, ఈ పాత్ర ఎప్పుడు సానుకూల భావాన్ని కలిగి ఉండి, ఈర్ష, ద్వేషాలకు దూరంగా ఉంటూ మరియు అందరికీ ప్రేమను పంచే మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది.

ప్రశ్న) మీరు ఒక నటుడు అవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?

జ)నేను నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత అహ్మదాబాద్ లోని ఎం.ఐ.సి.ఎ కాలేజీలో ఎం.బి.ఎ చేశాను. ఆ తర్వాత రేడియో సిటీ అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా పని చేశాను. ఆ సమయంలో ఒక రోజు ముంబైలోని ఒక రెస్టారెంట్ లో కూర్చోని భోజనం చేస్తున్న సమయంలో ఒక లేడీ నన్ను చూసి నా దగ్గరకి వచ్చి ఒక యాడ్ కోసం మిమ్మల్ని ఒకసారి ఆడిషన్ చెయ్యాలనుకుంటున్నాను మీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ యాడ్ ని దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన పవర్ రెంజర్స్ తమిళ వర్షన్ కి నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. అది చాలా ఆనందంగా ఉనింది. ఆ తర్వాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ‘ మాస్కో కావేరి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం తర్వాత ఇక నా ఉద్యగం మానుకొని పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టాలనుకున్నాను. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసిన తర్వాత నాకు ‘అందాల రాక్షసి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ప్రశ్న) మీ హాబీస్ ఏమిటి?

జ)నేను లెక్కలేనన్ని సినిమాలు చూస్తుంటాను. అలాగే నేను ఎక్కువగా క్రీడా విభాగాల గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాను. నేను క్రమం తప్పకుండా ఫుట్ బాల్ మరియు టెన్నీస్ ఆడుతూ ఉంటాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం మరియు క్రీడలకు సంబందించిన అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాను. అవి కాకుండా నా సిస్టంలో ఎన్నో గేమ్స్ ఆడుతూ ఉంటాను. నేను కొత్త స్నేహితులను చాలా తొందరగా ఏర్పరుచుకోగలను కానీ ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులే నాకు మంచి స్నేహితులు. మేము చిన్న చిన్న వాటికి కూడా తరచూ కలుస్తూ ఉంటామండీ కానీ నాకు పొగ త్రాగడం మరియు మందు తాగడం లాంటి అలవాట్లు లేవండీ(నవ్వుతూ).

ప్రశ్న) మీకు హైదరాబాద్ ఎంత వరకూ నచ్చింది?

జ)హైదరాబాద్ చాలా బాగుంది. హైదరాబాద్ ప్రజలు చాలా మంచి వారు. నా ఫ్యామిలీ ని ఇక్కడికి తీసుకు రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. నేను ఈప్పతి వరకూ చాలా మెట్రో పోలిటన్ నగరాల్లో నివసించాను కానీ అన్నింటి కంటే హైదరాబాద్ బెస్ట్. ఇక్కడి ప్రజల్ని నేను చాలా ఇష్ట పడుతున్నాను.

ప్రశ్న) దర్శకుడు హను మరియు ‘అందాల రాక్షసి’ టీంతో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?

జ)హను నాకు లైఫ్ టైం ఫ్రెండ్ అయిపోయారు. నా కెరీర్లో నేను గొప్పగా చెప్పుకునే చిత్రం ‘అందాల రాక్షసి’ . నవీన్ మరియు లావణ్య లతో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. లావణ్య వృత్తికి చాలా గౌరవం ఇస్తారు మరియు తన పని తానూ చక్కగా చేసుకుంటూ పోతారు. సెట్ లో తనకిచ్చిన డైలాగ్స్ తో ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంటుంది మరియు ఆమె నటన కూడా చాలా బాగుంది. నవీన్ చాలా మంచి వ్యక్తి మరియు చాలా మంచి కో స్టార్. అతను అందరి దగ్గరా అతన్ని ప్రమోట్ చేసుకునేదాని కంటే నా గురించే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు.

ప్రశ్న) ఫైనల్ గా వచ్చిన ‘అందాల రాక్షసి’ అవుట్ పుట్ పై సంతృప్తిగా ఉన్నారా?

జ)చాలా సంతృప్తిగా ఉన్నానండీ. అందాల రాక్షసి ఒక మాజిక్ లాంటి సినిమా. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మరియు విజువల్స్ చూసినప్పుడు నేను మైమరిచిపోయాను. ఈ సినిమా చూడటానికి వచ్చే సినీ అభిమానులందరూ ఒక గొప్ప అనుభూతికి లోనవుతారని దృడంగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా సినిమాని ఇంతలా ప్రమోట్ చేసినదానికి సాయి కొర్రపాటి గారికి మరియు విహారి గారికి నేను నా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్ర ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు చాలా మంది నా నటన చాలా బాగుందని అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తిగా చూసిన తర్వాత హను నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు, అది నేను ఎప్పటికీ మరిచిపోలేనిది.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలేమిటి?

జ)ప్రస్తుతం నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి కానీ ‘అందాల రాక్షసి’ చిత్రం విడుదల అయ్యేంత వరకూ నేను ఎలాంటి సినిమా ఒప్పుకోదలుచుకోలేదు. ప్రస్తుతం నేను తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాను. ఖచ్చితంగా త్వరలోనే తెలుగు సినిమాలు చేస్తాను.

ప్రశ్న) దీన్ని చదివే పాఠకులకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

జ)హను ఈ చిత్రంలో రూపొందించిన ప్రత్యేక పాత్రల ద్వారా ప్రేక్షకులు మంచి అనుభూతిని లోనవుతారు. అలాగే మిమ్మల్ని ఈ చిత్రం బాగా అలరిస్తుంది. ఈ చిత్రంలో మంచి పాటలున్నాయి, మంచి విజువల్స్ తో ఎంతో కలర్ ఫుల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అందాల రాక్షసి’ ఒక స్వచ్చమైన ప్రేమకథ. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

అంతటితో రాహుల్ గారితో జరిగిన ఇంటర్వ్యూ ముగిసింది. రాహుల్ గారితో చేసిన ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘అందాల రాక్షసి’ చిత్రం విజయం సాదించి రాహుల్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

Click Here For Interview in English

సమీక్ష 2 : జులాయి – 100% త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : ఎస్. రాధాకృష్ణ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూ సూద్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఆగష్టు రెండవ వారంలో బ్యాంకాక్ వెళ్లనున్న ఎన్.టి.ఆర్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా స్టైలిష్ గా కనిపించనున్న చిత్రం ‘బాద్షా’. ఈ చిత్రం చిత్రీకరణ కోసం ఆగష్టు 11న ఎన్.టి.ఆర్ బ్యాంకాక్ వెళ్లనున్నారు.

నవీన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ : అందాల రాక్షసి చిత్రం నా జీవితాన్నే మార్చేసింది

నవీన్ చాలా పొడవుగా ఉండి, మాస్ లుక్ తో కనిపించే నటుడు. భారీగా ఉన్న జుట్టు మరియు ఆ గడ్డంతో అతన్నిమొదటి సారి చూడగానే ఒక యావరేజ్ తెలుగు హీరో లాగా కనిపించడు.

టాలీవుడ్ ‘ప్రిన్స్ మహేష్’ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు


టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి వారసుడిగా తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుని,

నేను కన్న కలలో జీవిస్తున్నాను – లక్ష్మీ మంచు


సౌత్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘కాదల్’. చాలా విరామం తర్వాత లక్ష్మీ మంచు ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

పవన్ అభిమానులకు మళ్ళీ పిలుపునిచ్చిన పూరీ జగన్నాథ్


తన అభిమాన హీరోలతో నటించే అవకాశం అభిమానులకు జీవితకాలంలో ఎప్పుడో ఒకసారే వస్తుంది. అలాంటి అవకాశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వచ్చింది.

యముడికి అల్లుడై పోయిన అల్లరి నరేష్


ఫ్రెండ్లీ మూవీస్ కార్పోరేషన్ బ్యానర్ పై కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిచా పనాయ్ కథానాయికగా నటిస్తున్నారు.

లావణ్యతో ప్రత్యేక ఇంటర్వ్యూ : అందమైన ‘అందాల రాక్షసి’


లావణ్య ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న కథానాయిక. ఈ మధ్య కాలంలో వచ్చిన నూతన కథానాయికలలో లావణ్య

బాక్స్ ఆఫీసు బాబురావు “జులాయి” విశేషణ

హాయ్ ఫ్రెండ్స్…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో రానున్న ‘జులాయి’ చిత్రంతో బాక్స్ ఆఫీసు బాబురావు మళ్ళీ మీ ముందుకు రానున్నారు.