కొలవెరి పాటకు మరో రెండు పురస్కారాలు

ధనుష్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం “3” ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని

చంద్రశేఖర్ ఏలేటి చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్న తాప్సీ

తాప్సీ తన రాబోతున్న చిత్ర చిత్రీకరణ లో పాల్గొంటుంది చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండవ సారి గోపీచంద్ తో జత కట్టనుంది.

విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి

కొంత కాలం విరామం తరువాత శృతి హాసన్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణలో మరో రెండు రోజుల్లో పాల్గొననుంది.

“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్

యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు.

దరువు విడుదల వాయిదా?

రవితేజ, తాప్సీ జంటగా నటిస్తున్న ‘దరువు’ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది.

గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ప్రస్తుతం టైటిల్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా,

నా పేరు రామ్ చరణ్ తేజ్ కాదు: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పేరు రామ్ చరణ్ తేజ్ కాదని ‘రామ్ చరణ్’ మాత్రమే అంటున్నాడు.

మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది.

హిందీ ‘జేజమ్మ’గా కరీనా కపూర్


2009 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అరుంధతి సినిమాలోని ‘జేజమ్మ’ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.

‘దమ్ము’లో దుమ్ము లేపే డాన్సులు వేసిన ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ఈ వారం ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధమవుతుండగా

నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ’ సినిమా ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండగా,

అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?

కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవకాయ్ బిర్యాని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు అనీష్ కురివిల్లా.

అరుదైన గౌరవం దక్కించుకున్న సంతోష్ శివ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆసియా నుండి అమెరికన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రాఫర్ క్లబ్ లోకి ఆహ్వనించబడ్డ మొదటి సినిమాటోగ్రాఫర్.

రవితేజతో ‘సారోస్తారా’ అంటున్న అమలా పాల్

మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ సరసన అమలా పాల్ నటించనుంది.

సెప్టెంబరు వరకు విశ్రాంతి తీసుకోనున్న తమన్

సంగీత దర్శకుడు తమన్ కి 2011 బాగా కలిసి వచ్చింది.

గౌరవం చిత్రాన్ని నిర్మించబోతున్న ప్రకాష్ రాజ్

పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న దబంగ్ 2 షూటింగ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్,

ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్ధుల కోసం పాఠాలు చెప్పనున్న నాగార్జున?

అక్కినేని నాగార్జున ప్రతిభ ఉన్న కొత్త వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు.

గబ్బర్ సింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న దేవి శ్రీ ప్రసాద్


దేవి శ్రీ ప్రసాద్ “గబ్బర్ సింగ్” చిత్రం కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

“డేవిడ్ బిల్లా” గా రాబోతున్న అజిత్


అజిత్ రాబోతున్న చిత్రం “బిల్లా-2” తెలుగులో “డేవిడ్ బిల్లా – ది బిగినింగ్” గా రాబోతుంది.

చిత్రీకరణ చివరి దశలో “దేవుడు చేసిన మనుషులు”


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది.

ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం


“పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి ఈ మధ్యనే సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది.

తాండవంలో లక్ష్మి రాయ్


విక్రమ్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రానికి మరింత అందం తోడయ్యింది.

రజినీకాంత్ తో కలిసిన దీపిక పదుకొనే


తన రాబోతున్న చిత్రం “కోచాడియన్” చిత్ర చిత్రీకరణ కోసం దీపిక కేరళ వెళ్ళారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం త్రివేండ్రం వెళ్ళిన ఈ చిత్ర బృందంతో దీపిక కలిశారు.

ఐ ఎస్ ఎఫ్ ఎం విద్యార్థులకు డేట్స్ ఇచ్చిన నాగార్జున?


నాగార్జున నూతన ప్రతిభను ప్రోత్సాహించడంలో ఎప్పుడు ఒకడుగు ముందుంటారు ఇప్పటికే పరిశ్రమకు పలువురు దర్శకులు మరియు

మేఘాల్లో హన్సిక


తమిళ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుండి హన్సిక వరుస విజయాలను సొంతం చేసుకుంది.

సమీక్ష : “డిస్కో” : ప్రేక్షకుల సహనానికి పరీక్ష

 
విడుదల తేది : 20 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.5/5
దర్శకుడు : హరి కె చందూరి
నిర్మాతలు : మాచ రామలింగా రెడ్డి, కె అభినవ్ రెడ్డి
సంగీత దర్శకుడు: ఆనంద్
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ, సారా శర్మ

నిఖిల్ మరియు సారా శర్మ మొదటి సారిగా కలిసి నటించిన చిత్రం “డిస్కో”. హరి కే చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ లింగా రెడ్డి మరియు అభినవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే విడుదలయ్యింది ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

డిస్కో(నిఖిల్) ఒక అనాథ, అతనికి ముగ్గురు స్నేహితులు (ఖయ్యుం,విజయ్ సాయి, హ్యాపీ డేస్ పైడితల్లి). డిస్కో ప్రతి సారి చేసే అల్లరి పనులకు స్నేహితులు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అలాంటి డిస్కో షైనీ(సారా శర్మ) తో ప్రేమలో పడతాడు ఆమెను వెతుక్కుంటూ బ్యాంకాక్ కి కూడా వెళతాడు. షైనీ లోకల్ డాన్ (ఆశిష్ విద్యార్థి) కూతురని తెలుస్తుంది.

డిస్కో షైనీ ప్రేమను గెలుచుకున్న తరువాత కథలో ముఖ్యమయిన మలుపులు చోటు చేసుకుంటుంది. స్నేహమా ప్రేమా అన్న సందిగ్ధం లో కథ ప్రవేశిస్తుంది. తరువాత ఏమయింది? డిస్కో ప్రేమను గెలుచుకున్నడా? లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ :
ఎం.ఎస్ నారాయణ సూర్య భాయ్ పాత్రలో చాలా బాగా నవ్వించారు. మహేష్ బాబు బిజినెస్ మాన్ పాత్రలో ఎం ఎస్ నారాయణ చాలా అద్బుతంగా నటించారు.చిత్రంలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఇదే. అలీ పాత్ర రెండవ అర్ధ భాగంలోనే ఉంది ఈ పాత్ర చాలా బాగా వచ్చింది. రఘు బాబు తనవంతు ప్రయత్నం చేసిన పాక్షికంగానే సఫలం అయ్యారు. బుల్లి తెర కార్యక్రమాల మీద చేసిన హాస్యం పరవాలేదనిపించింది.

మైనస్ :

చిత్ర కథ మరియు కథనం అసలు బాగోలేవు కథ చెప్పిన విధానం దారుణం. చిత్రంలో లాజిక్ ఏమాత్రం కనపడదు ఏదయినా మంచి సన్నివేశం వస్తుందేమో అని ప్రేక్షకుడు వెయ్యి కళ్ళతో వేచి చూస్తుంటాడు. దర్శకత్వం బాగోలేదు నటనా పరంగా ఎవరి ప్రదర్శన ఆకట్టుకోదు. నిఖిల్ పవన్ కళ్యాణ్ మరియు రవితేజ లను అనుకరించడం చిరాకు కలిగిస్తుంది సారా శర్మ కాస్త్త్త నటన నేర్చుకొని నటిస్తే బాగుండేది.

చిత్రం లో దిగజారిన హాస్యాన్ని ప్రయత్నించారు ఇది నవ్వించకపోగా చిరాకు కలిగిస్తుంది. ఆశిష్ విద్యార్థి పాత్రను సరిగ్గ్గా తీర్చి దిద్దలేదు అలానే జీవ పాత్ర సంపూర్ణంగా అనిపించదు. చిత్రంలో కారణం లేకుండా సెంటిమెంట్ సన్నివేశాలు వస్తాయి. రెండవ అర్ధ భాగం అంతా అర్ధం లేని మలుపులతో సాగుతుంది. రెండవ అర్ధం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. చిత్రం చాలా పొడవు.

చిత్ర క్లైమాక్స్ కి అసలు అర్ధం లేదు ఆశిష్ విద్యార్థి ఎందుకు మారిపోతాడో సరయిన కారణం చూపించలేదు. చిత్రం లో ఇంకా చాలా తప్పులున్నాయి కాని అవన్నీ చెప్పి మీ విలువయిన సమయాన్ని వృధా చెయ్యదలుచుకోలేదు.

సాంకేతిక అంశాలు :

చిత్ర రీ-రికార్డింగ్ అసలు బాగోలేదు ప్రత్యేకంగా పాటల సమయంలో. మంత్ర ఆనంద్ సంగీతం ఆకట్టుకోలేక పోయింది.. ఎడిటింగ్ ఇంకా బాగా ఉండాల్సింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నా పలు చోట్ల బాగోలేదు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. హరి చందూరి దర్శకత్వం బాగోలేదు.

తీర్పు :
డిస్కో చిత్రాన్ని చూడకపోవడమే మంచింది. నటన బాగోలేదు, దర్శకత్వం బాగోలేదు, ఓపికను పరీక్షించే సన్నివేశాలు, చిత్ర నిడివి ఎక్కువగా ఉండటం, మీ సమయం వృధా చేసుకోవాలి అనుకుంటే ఈ చిత్రాన్ని చుడండి.

123తెలుగు.కాం రేటింగ్ : 1.5/5

అనువాదం : – రవి

Clicke Here For ‘Disco ’ English Review

సమీక్ష : నువ్వెక్కడుంటే నేనక్కడుంటా – ఈ సినిమా ఎక్కడుంటే మీరు అక్కడ ఉండకండి

 
విడుదల తేది : 20 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.25/5
దర్శకుడు : శుభ సెల్వం
నిర్మాతలు : డి. కుమార్, ఎమ్. ఈశ్వర ప్రసాద్
సంగీత దర్శకుడు: ప్రదీప్ కోనేరు
తారాగణం : ఉదయ్ కిరణ్, శ్వేతా బసు ప్రసాద్

‘చిత్రం’ సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్, తన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి శ్వేతా బసు ప్రసాద్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’. శుభ సెల్వం డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాని యు.కె అవెన్యూస్ బ్యానర్ పై డి. కుమార్ మరియు యం. ఈశ్వర ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. రెండు సంవత్సరాల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన ప్రతీసారి వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:
హరి (ఉదయ్ కిరణ్) కి తన మామ కూతురు నీలాంబరి (ఆర్తి) తో పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో, హరికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకుంటానని నీలాంబరి చెప్పడంతో, నీలాంబరి తండ్రి హైదరాబాదుకి పంపించి ఒక ఫైనాన్సు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనాధ అయిన హరిత (శ్వేతా బసు ప్రసాద్) ను హరి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మరో వైపు వీధి రౌడి అయిన భద్ర (అమిత్ కుమార్) కూడా హరితని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోమని వెంటపడి వేదిస్తుంటాడు. ఈ క్రమంలో హరిత, భద్ర నుండి తప్పించుకుంటూ హరికి దగ్గరవుతుంది. హరిత తనని ప్రేమించట్లేదంటూ భద్ర పగ పెంచుకుంటాడు. మరోవైపు హరికి కలలో వచ్చిన సంఘటనలు నిజమౌతుంటాయి. ఒకరోజు హరికి ఒక విచిత్రమైన కల వస్తుంది. ఆ కలలో భద్ర, హరితని కిడ్నాప్ చేసే క్రమంలో హరిత చనిపోయినట్లు కల కంటాడు. ఈ కల నిజమౌతుందని భయపడిన హరి ప్రియురాలు హరితని తన ఊరికి తీసుకెళ్తాడు. హరి కుటుంబ సభ్యులు హరితని అంగీకరించారా? హరికి వచ్చిన కల నిజమైందా? చివరికి భద్ర, హరితని ఏం చేసాడు? ఇవన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
హరి పాత్రలో ఉదయ్ కిరణ్ పర్వాలేదనిపించాడు. హరితగా శ్వేతా బసు ప్రసాద్ కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ఆకట్టుకొనే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే చిత్ర రెండవ భాగంలో మొదటి 30 నిముషాలు హరితని, హరి కుటుంభ సభ్యులు పరిచయం చేసుకునే సన్నివేశాలు ఊరట కలిగిస్తాయి. తప్పిపోయిన తన చిన్న కూతురు కాదంబరి ఎవరో కాదు హరిత అంటూ ఆశిష్ విద్యార్థి చేసే సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ప్రదీప్ కోనేరు సంగీతంలో రెండు పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బావున్నప్పటికీ దానిని తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హరికి వచ్చిన కలలు నిజమౌతాయి అని రెండు సన్నివేశాలు చూపించాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ కలలో హరిత చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకోవడం కోసం హరి చేసే ప్రయత్నాలు కూడా ఓకే. చివరికి హరి ఆమెను కాపాడే ప్రయత్నంలో చేసే పోరాటంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. సినిమా అంతా దాదాపు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసాడు కాని క్లైమాక్స్ సన్నివేశాల్లో మాత్రం తనలో ఉన్నది తమిళ దర్శకుడు అనుకున్నాడేమో విషాదాంతం చేసాడు. మొదటి భాగం అంతా చిరాకు తెప్పిస్తాయి. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. వీటికితోడు కథకు ఏ మాత్రం సంభందం లేకుండా పరమ రోత పుట్టించే సెపరేట్ కామెడీ ట్రాక్. ఎవీఎస్ మరియు జ్యోతి మధ్య సన్నివేశాలు బి గ్రేడ్ సినిమాని తలపిస్తాయి. బ్రహ్మానందం, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డిల సెపరేట్ కామెడీ ట్రాక్ నవ్వించకపోగా కామెడీతో భయపెట్ట వచ్చు అని నిరూపించారు దర్శకుడు. భద్ర పాత్రలో అమిత్ కుమార్ ఆకట్టులేకపోయాడు. మిగతావారిలో సగానికి పైగా తమిళ నటులు ఉండటం, వారి ప్రదర్శన కూడా ఏ మాత్రం రుచించలేదు.

సాంకేతిక విభాగం:
జనార్ధ మహర్షితో పాటుగా మరో ఇద్దరు రచయితలు కలిసి రాసిన సంభాషణలు సాధారణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. జీవన్ థామస్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగాలేదు. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం.

తీర్పు:

ఎన్నో వాయిదాలు పడి విడుదలైన ఈ సినిమా థియేటర్ వరకు వెళ్లి చూసేంత అవసరం లేదు. తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించటంతో ఎవరినీ మెప్పించలేక బోల్తా పడింది. ఈ సినిమా నడుస్తున్న థియేటర్ కి కొంచెం దూరంలో ఉంటే మంచిది.

123తెలుగు.కాం రేటింగ్: 1.25/5

అశోక్ రెడ్డి

Clicke Here For ‘Nuvvekkada Unte Nenakkada Unta’ English Review

భూత్-2 లో మధు శాలిని?

గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.

నేటి నుండి పవన్ టైటిల్ సాంగ్ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం మంచి అంచనాలతో ముందు వెళ్తోంది.

ప్రత్యేకం : రికార్డు పారితోషికాన్ని అందుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు.

ఆ రెండు సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఇలియానా

గోవా సుందరి ఇలియానాకి 2011 సంవత్సరం పెద్దగా అవకాశాలు లేకపోవడం,

చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న తాప్సీ

చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమాలో నటించేందుకు తాప్సీ చాలా ఉత్సాహం చూపిస్తుంది.

డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను: శృతి హాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు ముద్దుల కూతురు శృతి హాసన్ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న దమ్ము

యంగ్ టైగర్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ సెన్సార్ ఈ రోజే పూర్తి చేసుకోగా,

వాయిదా పడిన ఎందుకంటే ప్రేమంట ఆడియో విడుదల

రామ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి సంభందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది.

మహేష్ బాబు మరియు మెగా అభిమానుల మధ్య రచ్చ

నెల్లూరులో ప్రిన్స్ మహేష్ బాబు మరియు మెగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా పోలీసుల లాఠీ కారకు దారి తీసింది.

కెవ్వు కేక పాట చిత్రీకరణ పూర్తి

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని కెవ్వు కేక పాట చిత్రీకరణ పూర్తయినట్లు మాకు సమాచారం లభించింది.

రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?


మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో రానున్న సినిమాలో పరుల్ యాదవ్ హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

గబ్బర్ సింగ్ ఆడియోతో జల్సా చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో పై అభిమానులు ఆనందం వ్య్యక్తం చేస్తున్నారు.

కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

ఎన్టీఆర్ లో చాలా ఫైర్ ఉంది: త్రిషా


లవ్లీ లేడీ త్రిషా ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో అలరించే పాత్రతో మనముందుకు రాబోతుంది. ఇటీవలే ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ సరసన మొదటి సారి నటించాను. ఏ పాత్ర పోషించిన ఆ పాత్రలో ఇమిడిపోవడం అతనికి మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్ డాన్సుల్లో, ఫైట్స్ లో ఫైర్ ఉంది. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలెట్ అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర వెరైటీగా ఉంటుంది. ఇటీవల నేను పోషించిన పాత్రల్లో ఇదే అత్యుత్తమం అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో త్రిషతో పాటుగా అలనాటి హీరొయిన్ రాధా కూతురు కార్తీక కూడా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వల్లభ నిర్మించారు.

మరోసారి పోలిస్ పాత్రలో గోపీచంద్


పోలిస్ పాత్రలు చేయడమంటే గోపిచంద్ కి కొట్టిన పిండే. గతంలో ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలిస్ పాత్రలు చేసి మెప్పించాడు. అదే తరహాలో భూపతి పాండ్యన్ డైరెక్షన్లో వస్తున్న మరోసారి ఖాఖీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అతని వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఒక అమ్మాయి ప్రేమని ఎలా గెలుచుకున్నాడు అనేది చిత్ర కథ. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని జయబలజి రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది.