మిస్టర్ నోకియా విడుదల వాయిదా?

మంచు మనోజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ నోకియా’ చిత్రం ఫిబ్రవరి 17 న వచ్చే సూచనలు కనిపించడం లేదు.

సారోస్త్రార రొస్తరా’ అమ్మాయిని కలుద్దాం

కంగారు పడకండి. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం ఎంత హిట్ అయిందో

మహేష్ – సుకుమార్ సినిమా ప్రారంభం

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం ముహూర్తం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది.

జగపతి బాబుకి పుట్టిన శుభాకాంక్షలు

ఈ రోజు జగపతి బాబు పుట్టిన రోజు.

భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్

సెలెబ్రిటి క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. సిసిఎల్ 1 కంటే సిసిఎల్ 2 లో

కరీనా కపూర్ తో కలిసి నటించనున్న మరియం జకారియ

ఇరానియన్ – స్వీడిష్ దేశ నటి అయిన మరియం జకారియ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.

నాని, సమంత చిత్ర పేరుని ఖరారు చేసిన గౌతం మీనన్

“ఈగ” చిత్రం తరువాత నాని మరియు సమంత లు గౌతం మీనన్ చిత్రం లో కనిపించబోతున్నారు ఈ చిత్రం త్రిభాషా చిత్రం గా ఉండబోతుంది తెలుగు,తమిళ మరియు హిందీ లలో ఒకేసారి నిర్మిస్తున్నారు తెలుగు లో నాని కథానాయకుడిగా చేస్తుండగా తమిళ చిత్రం లో జీవా చేస్తున్నారు. తమిళ చిత్రానికి పేరు ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈరోజు గౌతం మీనన్ తెలుగు చిత్ర పేరుని “ఎటో వెళ్లిపోయింది మనసు”గా ప్రకటించారు. ఈ పేరు గతం లో నాగార్జున నటించిన “నినే పెళ్ళాడుతా” చిత్రం లో ఒక పాట ప్రేరణగా పెట్టారు. “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.

“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్

వై వి ఎస్ చౌదరి “రేయ్” చిత్ర తరువాతి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. గత షెడ్యూల్ ని బ్యాంకాక్ లో డిసెంబర్ లో ముగించిన ఈ దర్శకుడు తన సమయం మొత్తం రవితేజ నటిస్తున “నిప్పు” కి కేటాయించాడు. నిప్పు చిత్రాన్ని ఈయనే నిర్మించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. నిప్పు ఈనెల 17న విడుదల కానుండగా ఇప్పుడు వై వి ఎస్ “రేయ్” చిత్రం తరువాతి షెడ్యూల్ ని నిప్పు విడుదల తరువాత మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత వై వి ఎస్ అమెరికా లో మిగిలిన భాగం పూర్తి చెయ్యబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ చిత్రం తో హీరో గా పరిచయం కానున్నారు.

ప్రేమ దైర్యాన్ని ఇస్తుంది – కరుణాకరన్


రామ్ మరియు తమన్నా లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. ఈ చిత్రం గురించి కరుణాకరన్ మాట్లాడుతూ ప్రేమ ఉంటె ప్రపంచంలో సాదించలేనిది ఏది లేదు అంత శక్తి ని ఇస్తుంది ప్రేమ అటువంటి శక్తినే మా చిత్రం లో జంటకి కూడా ఇచ్చింది అని అన్నారు. నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ ” ఒక అమ్మాయి అబ్బాయి గొడవపడిన ప్రేమే వారి ఆనందం వెళ్లి విరిస్న ప్రేమే కారణం అలాంటి ఒక కథే ఈ చిత్రం ఇందులో రామ్ ని కొత్త కోణం లో చూస్తారు, ఇంకా రెండు పాటల్ని చిత్రీకరించాల్సి ఉంది” అని చెప్పారు.ఈ చిత్రం మార్చ్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సురేందర్ రెడ్డి తో చిత్రం ఒప్పుకున్న అల్లు అర్జున్


అల్లు అర్జున్ తరువాతి చిత్రం సురేందర్ రెడ్డి తో చెయ్యనున్నారు. అల్లు అర్జున్ మరియు సురేందర్ రెడ్డి తొలిసారిగా జతకట్టనున్నారు ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ గా పేరు ఉన్న అల్లు అర్జున్ స్టైలిష్ టేకింగ్ తో చిత్రాలు చేసే సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరం. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక చిత్రం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న “ఎవడు” చిత్రం లో ఒక చిన్న పాత్ర కూడా చేస్తున్నారు. ఏప్రిల్ లేదా మే లో ఈ చిత్రం మొదలు కావచ్చని సమాచారం.

బిగ్ బి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి


కూలి(1982) చిత్రీకరణ లో తగిలిన గాయం అమితాబ్ బచ్చన్ ను ముప్పై ఏళ్ళయిన వెంటాడుతూనే ఉంది. ఈరోజు పొద్దున మూడు గంటల పాటు అమితాబ్ కి శాస్త్ర చికిత్స చేసిన వైద్యులు నవ్వుతు బయటకి వచ్చారు. అభిషేక్ బచ్చన్ పాత్రికేయులతో మాట్లాడుతూ గతం లో జరిగిన ప్రమాదం వల్లే ఈ నొప్పి వచ్చింది అని మూడు గంటల పాటు జరిగి శస్త్ర చికిత్స సులభంగా జరిగింది అని ప్రస్తుతం అమితాబ్ కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ థియేటర్ నుండి వార్డుకు తరలించారని ప్రస్తుతం వైద్యులు పరిశీలనలో ఉంచారని కొదొఅ జూనియర్ బచ్చన్ తెలిపారు.

ప్రేక్షకులని అలరించే చిత్రాలే పెద్ద చిత్రాలు – అల్లు అర్జున్


అల్లు అర్జున్ చిన్న చిత్రం మరియు పెద్ద చిత్రాలకు అర్ధం ఏంటో చెప్పారు. ప్రేక్షకులని అలరించగలిగిన చిత్రం పెద్ద చిత్రం అని అలా చెయ్యని చిత్రాలు చిన్న చిత్రాలు అని అల్లు అర్జున్ అన్నారు. “ఈరోజుల్లో” చిత్ర ఆడియో విడుదలలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ మాట అన్నారు. విజయం అనేది కథలో విషయం మీద ఆధారపడుతుందని అన్నారు. ఈరోజుల్లో చిత్రం తో రేష్మ మరియు శ్రీ తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో పాటలు చాలా బాగున్నాయని చిత్రీకరణ కూడా అంతే బాగుంటుంది అని అల్లు అర్జున్ అన్నారు. దర్శకుడు మారుతి గురించి చెబుతూ అయన చాలా కష్టపడి పని చేసే వ్యక్తి అని అన్నారు. “గుడ్ ఫ్రెండ్స్” బ్యానర్ మీద నిర్మితమయిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

రజిని కాంత్ చిత్రం నుండి తప్పుకున్న స్నేహ


రజిని కాంత్ రాబోతున్న చిత్రం “కొచ్చాడియాన్” లో రజినీకాంత్ సోదరిగా నటి స్నేహ నటించబోతున్నారని గతం లో చెప్పాము కాని

కన్నడ పరిశ్రమ లో అద్బుతమయిన అవకాశం దక్కించుకున్న ఈగ


విడుదల కు రెండు నెలలు ఉండగానే “ఈగ” చిత్రంకి కన్నడ పరిశ్రమ లో ఆసక్తికరమయిన సంఘటన చోటు చేసుకుంది.

ప్రత్యేకం : రాజమౌళి ‘ఈగ’ ఆడియో తేది ఖరార్

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న భారీ గ్రాఫిక్స్ చిత్రం ‘ఈగ’

సమీక్ష : ఎస్ఎమ్ఎస్ – ప్రేమ – ద్వేషం మధ్య దోబూచులాట

విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : తాతినేని సత్య
నిర్మాత :ఆర్ బి చౌదరి
సంగిత డైరెక్టర్ : వి సెల్వ గణేష్
తారాగణం : పోసాని సుధీర్, రెజీన

ప్రిన్స్ మహేష్ బాబు బావ అయిన సుదీర్ బాబు హీరోగా చేసిన మొదటి చిత్రం ‘ఎస్ఎమ్ఎస్’. రేజీన హీరొయిన్ గా నటించగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజే విడుదలైంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఎస్ఎమ్ఎస్ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ చిత్రంలో కథ పెద్దగా ఏమీ లేదు. శివ (సుదీర్ బాబు) ఒక కొరియర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతను పెద్దగా బాధ్యతలు లేకుండా బతికేస్తుంటాడు. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తుండగా రేడియో జాకీగా పనిచేసే శృతి (రేజీన) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెను మొదటి చూపులోనే ప్రేమించి ఆమెను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. శృతి అయిష్టంగానే అతనిని పరిచయం చేసుకుంటుంది. కాని మెల్లిగా శృతి అతన్ని ప్రేమించడం మొదలు పెట్టి తన ప్రేమను అతనికి తెలిపే సమయంలో శివ తన భాద్యతారాహిత్యమైన నేచర్ తో ఆమెని అవమానిస్తాడు. అలా ప్రేమ వారిద్దరి మధ్య దోబూచులాడుతుంది. ఈర్ష్య మరియు కోపంతో వారిద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. శివ భవిష్యత్తులో స్థిరపడితే పెళ్లి చేసుకుంటానని శృతి అంటుంది. అదే సమయంలో వీరి ప్రేమ అనుకోని మలుపు తిరుగుతుంది. తరువాత ఏం జరిగింది. వీరి ప్రేమ చివరికి సక్సెస్ అయిందా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

సుదీర్ బాబు డాన్సులతో మెప్పించాడు. ఫైట్స్ కూడా చాలా బాగా చేసాడు. ఇది అతని మొదటి చిత్రమైన కూడా బాగా నటించాడు. అతని ఎనర్జీ లెవల్స్ కూడా బావున్నాయి. రేజీన చాలా బాగా చేసింది. శృతి పాత్రకి ఆమె అతికినట్లు సరిపోయింది. తన అందంతో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటూ నటనతో అందరిని మెప్పించింది. చీరల్లో ఇంకా బావుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా చేసింది. ఆమెకు కూడా భవిష్యత్తులో ఇండస్ట్రీలో నిలదొక్కుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరో స్నేహితుడు చంటి బాగానే నవ్వించాడు. క్లైమక్స్ లో తాగుబోతు రమేష్ బాగా నవ్వించాడు. సుదీర్, రేజీన మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా బాగా తీసాడు. హీరో పాత్ర ఎంటర్టైన్ చేస్తూ చిత్ర మొదటి భాగం వేగంగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్:

సుదీర్ తన గొంతు విషయంలో జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. చిత్ర రెండవ భాగం బాగా నెమ్మదిగా సాగింది. దర్శకుడు మధ్యలో అనవసరమైన విషయాలు మధ్యలోకి తీసుకొచ్చాడు. సుదీర్ తల్లిగా చేసిన రోహిణి కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించింది. సాంగ్స్ సందర్భానుసారంగా లేకుండా కొంత అసహనానికి గురి చేస్తాయి. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోలేకపోయారు. దర్శకుడు కొంత వరకు మాత్రమే పర్వాలేదనిపించాడు.

సాంకేతిక విభాగం:

నిర్మాణాత్మక విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ కూడా బావున్నాయి. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ మరియు ఫైట్స్ గురించి ప్రత్యేకంగా అభినందించాలి. సంభాషణలు పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సెల్వ గణేష్ మ్యూజిక్ కొన్ని పాటల్లో బావుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. చిత్ర రెండవ భాగంలో స్క్రీన్ప్లే ఇంకా బాగా రాసుకుని ఉంటే బావుండేది.

తీర్పు:

ఎస్ఎమ్ఎస్ చిత్రం సుదీర్ బాబు హీరోగా తెరంగ్రేటం చేయడానికి సరైన సినిమానే అని చెప్పుకోవాలి. అతని డాన్సులు మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రేజీన ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఆమె యువతకి బాగా నచ్చుతుంది. అంచనాలు ఏమీ లేకుండా వెళ్లి చూడండి మీకు తప్పక నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్: 3/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘SMS’ English Review

నాకు అంత తొందర లేదు : తమన్నా

 

తమన్నా ఎప్పుడు తప్పుడు కారణాలతోనే వార్తల్లో నిలుస్తుంది అవి కూడా డేట్స్ విషయం లోనే జరుగుతుంటుంది.

వెన్నెల 1 1/2 చిత్ర బృందంకి భయానక అనుభవం

వెన్నెల 1 1/2 చిత్ర బృందం దాదాపుగా చావు ని తప్పించుకుంది.

పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాధ్ సినిమా టైటిల్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాధ్ కలిసి సినిమా చేయబోతున్నామని ప్రకటించగానే

మాస్ పాత్రలంటే నాకెంతో ఇష్టం: సమంతా


అందాల భామ సమంతా తనకు మాస్ పాత్రలు చేయడమంటే ఇష్టమంటోంది.

నిజాయితి ఉన్న చిత్రం మంచి కమ్మర్షియల్ చిత్రం – ప్రకాష్ రాజ్

ఒక దర్శకుడిగా ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను పలు ప్రశ్నలు అడిగారు.

రేపు శస్త్రచికిత్స చేయించుకోనున్న బిగ్ బి

కడుపు నొప్పితో బాధపడుతున్నఅమితాబ్ బచ్చన్ కి శనివారం శస్త్ర చికిత్స చెయ్యనున్నారు.

అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి కన్నుమూసారు

 

అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గురువారం రాత్రి కన్నుమూశారు.

కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి


అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటుంది.

నేడే వరుడు కాబోతున్న ఆర్యన్ రాజేష్


కీర్తి శేషులు ఈఈవి సత్యనారాయణ గారి అబ్బాయి, కామెడీ కింగ్ అల్లరి నరేష్ సోదరుడు అయిన ఆర్యన్ రాజేష్ వివాహం సుభాషిణితో నేడు అంగరంగ వైభవంగా జరగనుంది.

నేను బొబ్బిలి రాజా చేస్తాను అని చెప్పలేదు : రానా

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మరియు బాలివుడ్ లో ఒకేసారి చిత్రాలు చేస్తున్న ఒకే ఒక కథానాయకుడు రానా.

సమీక్ష : ఋషి – హృదయాన్ని కదిలించే ఒక డాక్టర్ పోరాటం

విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012
దర్శకుడు : రాజ్ మాదిరాజు
నిర్మాత :  రమేష్ ప్రసాద్
సంగిత డైరెక్టర్ : స్నిగ్ధ,డాన్ చంద్రన్
తారాగణం : అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ

ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థ ముప్పై యేళ్ల తరువాత తీసిన సినిమా ‘ఋషి’. అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ ముఖ్య పాత్రల్లో నటించగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. స్నిగ్ధ మరియు డాన్ చంద్రన్ కలిసి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఋషి (అరవింద్ కృష్ణ) ఉన్నత భావాలు ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్. తన ప్రవర్తన వల్ల తన స్నేహితులకు దూరమైన లెక్క చేయడు. అదే కాలేజ్ స్టూడెంట్ అయిన పూజ (సుప్రియ శైలజ) మొదట అరవింద్ ని అపార్ధం చేసుకున్న తరువాత ప్రేమిస్తుంది. ఋషి కూడా పూజని ప్రేమిస్తాడు. వీరి ప్రేమకి పూజ తల్లితండ్రులు కూడా అంగీకరిస్తారు. ఋషి ఎమ్బీబీఎస్ చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్ (గౌరవ్) అనే కుర్రవాడు గుండె జబ్బుతో ఉన్న కుర్రవాడు కలుస్తాడు. గుండె మార్పిడి చేస్తే కార్తీక్ బతుకుతాడు. అతనికి సరిపడే గుండె దొరికిందా? అతను రుషి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు. ఋషికి, కార్తీక్ కి సంబంధం ఏంటి? ఇవన్ని తెలుసుకోవాలంటే ఋషి సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఋషి పాత్రలో నటించిన అరవింద్ కృష్ణ మంచి పరిణతి కూడిన నటన ప్రదర్శించాడు. అతని గత చిత్రాల కంటే ఈ చిత్రంలో బాగా నటించాడు. క్లైమాక్స్ ముందు పార్టీ సన్నివేశంలో బాగా నటించాడు. ఋషి పాత్రకు అతికినట్లు సరిపోయాడు. అతని పాత్ర డిజైన్ చేసిన విధానం కూడా బావుండటంతో ప్రేక్షకులు ఆ పాత్రకు కనెక్ట్ అయిపోతారు. ఋషి ప్రియురాలు పూజ పాత్రలో నటించిన సుప్రియ శైలజ తెలుగులో మొదటి సినిమా అయినా బాగా నటించింది. గ్లామర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర కాకుండా నటనకి స్కోప్ ఉన్న పాత్ర ఎంచుకోవడం అభినందనీయం. ఆమె అందంగా కూడా ఉంది. గుండె జబ్బుతో బాధపడే కార్తీక్ గా నటించిన గౌరవ్ కూడా బాగా నటించాడు. సాల్మన్ తో చేసిన సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. సీనియర్ హీరో అయిన సురేష్ నెగటివ్ పాత్రలో లక్ష్మిపతిగా బాగా చేసాడు. హీరో స్నేహితులుగా చేసిన నరసింహ రాజు, సాల్మన్ బాగానే నవ్వించారు. సిగ్ధ-డాన్ చంద్రన్ అందించిన సంగీతంలో మూడు పాటలు బావున్నాయి. స్నిగ్ధ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బావుంది.

మైనస్ పాయింట్స్:

చిత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో రెండవభాగం కొంత బోర్ కొడుతుంది. పాటలు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు. చిత్ర ఆఖరి 45 నిముషాలు మరియు మొదటి భాగంలో కొంత వరకు ఎడిట్ చేసి ఉంటే బావుండేది.

సాంకేతిక విభాగం:

చాలా సన్నివేశాలు పాటలు ఎడిటింగ్ చేయకుండా వదిలేసారు. దర్శకుడు రాజ్ మాదినేని మొదటి చిత్రం అంకుల్ విఫలమైనా ఈ సారి మంచి చిత్రంతో మనముందుకు వచ్చాడు. తను ఎంచుకున్న కాన్సెప్ట్ కి న్యాయం చేయగలిగాడు. ఈ రోజుల్లో దర్శకులు అంతా కమర్షియల్ సినిమాలు అంటూ చేతులు కాల్చుకుంటున్నా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందించాలి. అలాగే నిర్మాత రమేష్ ప్రసాద్ గారు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ని నమ్మి సినిమా నిర్మించడం అభినందనీయం. పలు హిందీ చిత్రాలకు పనిచేసిన కెమరామెన్ త్రిభువన్ బాబు సాధినేని సినిమాటోగ్రఫీ కూడా బావుంది.

తీర్పు:

మంచి హృదయంతో తీసిన సినిమా. ఒక డాక్టర్ తపనను బాగా చూపించారు. మీరు చూసే రెగ్యులర్ తెలుగు సినిమాలులాగా కాకుండా, ఏదైనా కొత్తగా చూడాలని కోరుకుంటే, ఋషి మీకు నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్:

NA ఋషి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు అందువల్ల ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వడం సబబు కాదని భావిస్తున్నాం.

అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For Rushi English Review

సమీక్ష : ధోని – 17 x 8 చుట్టూ తిరిగే పవర్ఫుల్ మెలోడ్రామ

విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5
దర్శకుడు : ప్రకాష్ రాజ్
నిర్మాత :ప్రకాష్ రాజ్
సంగిత డైరెక్టర్ : ఇళయరాజా
తారాగణం : మాస్టర్ ఆకాష్ ,ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి తీసిన చిత్రం ‘ధోని’. ఆకాష్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రాధిక ఆప్టే, శరత్ బాబు, నాజర్, గొల్లపూడి మారుతీరావు మరియు ఇతర నటీనటులు నటించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తీసిన చిత్రం. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శిక్షనచ్య అయిచ గో’ చిత్ర ప్రేరణతో ధోని చిత్రాన్ని తీసారు. ఈ రోజు ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన వేయడం జరిగింది. ధోని చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) మధ్య తరగతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. సుబ్రహ్మణ్యం భార్య చనిపోవడంతో ఆయన ఇద్దరి పిల్లల్ని ఆయనే పెంచుతుంటాడు. ఆ ఇద్దరు పిల్లలికి మంచి చదువు చెప్పించేందుకు కొన్ని త్యాగాలు కూడా చేస్తాడు. కాని అతని కొడుకు కార్తీక్ (ఆకాష్) కి మాత్రం చదువు అంటే ఆసక్తి ఉండదు. అతను క్రికెట్ అంటే బాగా ఆసక్తి. కార్తీక్ కి పరీక్షల్లో సరిగా మార్కులు రాకపోవడంతో సుబ్రమణ్యం బాధపడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం పొరుగింటిలో ఉండే నళిని (రాధిక ఆప్టే) కి సుబ్రహ్మణ్యం పిల్లలంటే ఇష్టం. కార్తీక్ కి చదువుల్లో రాణించలేకపోవడంతో అతని స్కూల్ యాజమాన్యం సుబ్రహ్మణ్యం పై ఒత్తిడి తెస్తుంది. అదే సమయంలో సుబ్రహ్మణ్యం విపరీత నిర్ణయాలు తీసుకుంటాడు. స్కూల్ యాజమాన్యం మరియు సుబ్రహ్మణ్యం ఒత్తిడి పెరిగిన సమయంలో కార్తీక్ 17 x 8 ఎంత అంటూ ఒక సులభమైన ప్రశ్న అడుగుతాడు. ఎవరికీ తోచిన రీతిలో వారు సమాధానం చెబుతారు. అప్పుడు సుబ్రహ్మణ్యం తన కొడుకును కాపాడుకునేందుకు వ్యవస్థపై పోరాటం మొదలు పెడతాడు. అదే సమయంలో నళినిలో ఉన్న చీకటి కోణాన్ని గుర్తిస్తాడు. ఏంటది? సుబ్రహ్మణ్యం తన పోరాటంపై చివరి వరకూ నిలబడ్డాడా ?

ప్లస్ పాయింట్స్:

మంచి అర్ధవంతమైన సినిమా తీసినందుకు ప్రకాష్ రాజ్ ను అభినందించాలి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తనని తను నిరూపించుకున్నాడు. ధోని మీ హృదయాన్ని తాకుతుంది. చిత్ర మొదటి భాగం మంచి కథతో వెళ్తూ ఇంటర్వల్ వరకు బాగా తీసాడు. కార్తీక్ పాత్రలో ఆకాష్ చాలా బాగా నటించాడు. అతని పరిణతి కూడిన నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. రాధిక ఆప్టే చాలా మంచి నటి. ఆమె ఈ సినిమాలో కూడ బాగా నటించింది. కాటన్ చీరల్లో సింపుల్ గా బావుంది.

గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, తనికెళ్ళ భరణి మరియు మురళి శర్మ బాగా నటించారు. బ్రహ్మానందం చిత్ర మొదటి మొదటి భాగంలో బాగానే నవ్వించాడు. ప్రభుదేవా ఒక పాటలో తళుక్కున మెరిసాడు. సెంటిమెంట్ సన్నివేశాలు చాలా బాగా తీసారు. చాలా మధ్య తరగతి కుటుంబాలు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రకాష్ రాజ్ టీవీ స్టుడియోలో మాట్లాడే సన్నివేశాలు, మరియు ముఖ్యమంత్రిని 17 x 8 ఎంత అని అడిగే సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్:

చిత్ర రెండవ భాగం అనుకున్న స్థాయిలో తీయలేకపోయాడు. కొన్ని అంశాలు వదిలేసి ఉంటే బావుండేది. సమస్యకు సంభందించి ఒక వైపు మాత్రమే వాదన జరగడం రెండు వైపు వదిలేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ రాధిక ఆప్టే మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునే సన్నివేశాలు మార్చుకునే సన్నివేశాలు బాగా తీసి ఉంటే ఇంకా బావుండేది.

సాంకేతిక విభాగం:

ప్రతి ఒక్కరు ఇళయరాజా గారి సంగీతం గురించి ఎంతో ఆశించి వస్తారు. ఇళయరాజా గారి సంగీతం పర్వాలేదు. బ్యాక్ మ్యూజిక్ మాత్రం బావుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రకాష్ రాజ్ స్క్రీన్ప్లే చిత్ర మొదటి భాగంలో చాలా బావుంది కాని రెండవ భాగంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైలాగ్స్ బావున్నాయి.

తీర్పు:

ధోని మీ గుండెని తాకే పవర్ఫుల్ మెలోడ్రామా. చిత్ర రెండవ భాగంలో కొన్ని అనవసరమైన అంశాలు ఉన్నప్పటికీ వాటిని వదిలేస్తే నటీనటులు ప్రదర్శించిన అధ్బుత నటన ఆకట్టుకుంటుంది. ఏ మరియు బి సెంటర్స్ వారికీ బాగా నచ్చుతుంది. మసాల సినిమాలు చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ధోని.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.5/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For Dhoni English Review

తమిళ పరిశ్రమ లో సమస్యలో చిక్కుకున్న ఇలియానా

ఇలియానా తమిళ పరిశ్రమ లో పెద్ద సమస్యలో చిక్కుకుంది.

ప్రకాష్ రాజ్ కి ప్రశంశలు తెచ్చిపెట్టిన ధోని

ఈరోజు ఇక్కడ జరిగిన “ధోని ” చిత్ర ప్రదర్శనలో పాల్గొన్న పాత్రికేయులు మరియు ప్రకాష్ రాజ్ సన్నిహితుల స్పందన చూసి ప్రకాష్ రాజ్ ఆనందంగా ఉన్నారు.

బ్రెజిల్ వెళ్లనున్న తమన్

ఎస్ ఎస్ తమన్ తను రాబోయే రెండు చిత్రాలకు సంగీతం సమకూర్చటానికి బ్రెజిల్ కి

ప్రత్యేకం : మహేష్ – సుకుమార్ సినిమాలో తమన్నా చెయ్యట్లేదు!


కొద్ది రోజుల క్రితం సుకుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు సరసన మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా హీరొయిన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

చిత్ర పరిశ్రమలను విడదీయకండి : శ్రియ

చిత్ర పరిశ్రమను దక్షిణ మరియు ఉత్తర పరిశ్రమలుగా విడదీయటంలో శ్రియ వ్యతిరేకం.

దమ్ము ఆడియో విడుదల తేదీ ఖరారు?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్ర ఆడియో ఉగాది రోజు విడుదల చేయడానికి

బ్యాంకాక్ లో దరువు వేస్తున్న రవితేజ


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘దరువు’ ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ప్రత్యేక ఇంటర్వ్యూ : ఎన్.టి.ఆర్ మరియు మహేష్ ల తో చిత్రాలు చెయ్యటం నా కల – పరుచూరి కిరీటి

రాబోయే తరానికి మంచి నిర్మాత పరుచూరి కిరీటి. “సింహ” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత.

సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?

రామ్ చరణ్ సాయి కుమార్ తో పోరాడనున్నాడు అదేనండి వెండితెర మీద రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు”

నన్ను బాధ పెట్టేవాళ్ళకి నేను దూరంగా ఉంటాను : ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ పెర్ఫెక్షనిస్ట్ అనే పదానికి బాగా సరిపోతారు.

బాలివుడ్ లో అవకాశాన్ని తిరస్కరించిన కాజల్

దక్షణాది కథానాయికలు బాలివుడ్ లో అవకాశం కోసం చాలా వేచి చూస్తుంటారు ఎందుకంటే

శివ రాత్రికి విడుదల కానున్న “గబ్బర్ సింగ్” టీజర్

 

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సంతోషకరమయిన వార్త. ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున “గబ్బర్ సింగ్”

ముఖాముఖి : రానా – నా ఇష్టం నా మొదటి కమర్షియల్ సినిమా


యువ హీరో రానా తన నూతన చిత్రం ‘నా ఇష్టం’ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబందించి సినీమాక్స్ లో విలేఖరుల సమావేశం జరగగా ఆయనతో మేము ముచ్చటించడం జరిగింది. ఈ చిత్రం మార్చి 23న విడుదలకు సిద్ధమవుతుండగా ఆడియోని ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నారు. రానా చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ప్ర: నా ఇష్టం చిత్రంపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
స: నా కెరీర్లో మొదటిసారిగా 100%కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేసాను. నా పాత్రని బాగా నేను బాగా ఎంజాయ్ చేసాను. మంచి ఎనర్జీతో సాగుతూ పాజిటివ్ వైఖరితో ఉండే పాత్రని మీరు చూడబోతున్నారు. నేను ఈ సినిమాలో తూర్పు గోదావరి జిల్లా యాసలో మాట్లాడతాను. ప్రేక్షకులు దానిని బాగా ఆస్వాదిస్తారు. అలాగే నేను ప్రతీ పాటలో డాన్స్ చేసాను. 5, 6 యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో కామెడీ కూడా ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది.

ప్ర: మీ పాత్ర ఆసక్తికరంగా ఉంది. దీని గురించి ఇంకొంత చెప్పగలరా?
స: ఇందులో నా పాత్ర పేరు గని అని పిలవబడే ఈ కుర్రాడి అసలు పేరు గణేష్. ప్రపంచంలో అతనిని మించిన స్వార్ధపరుడు ఉండడు. విచిత్రమైన మనస్తత్వం ఉన్న వాడు. అతను అవకాశాల కోసం ఎదురు చూడడు. అవకాశాలు అతని వరకు వస్తే మాత్రం వదిలి పెట్టడు. స్క్రిప్ట్ విన్న మొదటి సారే నాకు ఈ పాత్ర బాగా నచ్చేసింది. నా గత సినిమాల్లో పోషించిన పాత్ర లాగా నా వయసుకు తగ్గ యువకుడి పాత్రను పోషిస్తున్నాను.

ప్ర: మీరు డాన్సులు ఫైట్స్ చేయడం ఎంజాయ్ చేసారా?
స: అవును. నేను ప్రతి పాటలోనూ డాన్స్ చేసాను. కొత్త రకమైన డాన్స్ స్టెప్స్ ట్రై చేసాను. వాటికోసం చాలా హోం వర్క్ చేసాను. సెట్స్ కి వెళ్ళే ముందు రిహార్సల్స్ చేయడం బాగా ఉపయోగపడింది.

ప్ర: ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు అతని పనితీరు ఎలా ఉంది?
స: ప్రకాష్ చాలా అనుభవం ఉన్న టెక్నీషియన్. ఆర్టిస్ట్ ల నుండి ఏం అతనికి బాగా తెలుసు. మరియు అతని ఎనర్జీ ఆశ్చర్యకరంగా ఉంది. మంచి సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అలాగే సంగీతం పై కూడా మంచి పట్టు ఉంది. చక్రి నుండి మంచి ఆల్బం రాబట్టాడు.

ప్ర: సంగీతం గురించి చెప్పండి. చక్రి నుండి ఎలాంటి సంగీతం ఆశించొచ్చు?
స: చక్రి గత సినిమాల సంగీతం అంటే మాస్ బీట్స్ తో సాగుతుంది. కాని ఈ సారి మీరు ఆయన సంగీతం విని ఆశ్చర్యపోతారు. యువతకి నచ్చే ఫీల్ గుడ్ ఆల్బం తో రాబోతున్నాడు. ఆల్బం కూడా నన్ను బాగా ఆకట్టుకుంది.

ప్ర: జెనీలియాతో పనిచేయడం ఎలా ఉంది?
స: ఆమె మంచి నటి. అలాగే ఆమె సహకారం కూడా మరువలేనిది. ఆమె ఎంత ప్రతిభ ఉన్న నటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంక నేను మళ్లీ చెప్పాల్సిన విషయం లేదు. ఆమె ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

ప్ర: మీరు చేయబోయే సినిమాలు ఏమిటి?
స: ఇప్పట్నుండి నేను ప్రతి సంవత్సరం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి 4 నుండి 5 సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. అలాగే మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలతో సంతోషంగా ఉన్నాను. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ‘డిపార్ట్మెంట్’ మరియు క్రిష్ డైరెక్షన్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రాలు చేస్తున్నాను.

ప్ర: నా ఇష్టం నిర్మాతలతో మీ సంబంధం ఎలా ఉంది?
స: పరుచూరి కిరీటి గారు తమ మొదటి చిత్రంతోనే ‘సింహ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వారి బ్యానర్ గొప్పతనం గురించి నాకు తెలుసు కాబట్టి ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే వారికి సినిమా నిర్మాణం పై మంచు పట్టు ఉంది. మరియు వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.

ఇంతటితో ఈ ముఖాముఖి ముగిసింది. రానా మంచి ఈ చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

123తెలుగు. కామ్ టీం

బన్నీ సినిమా కోసం దర్గా సెట్


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక చిత్రం చేస్తున్న విషయం మనకు తెల్సిందే.