టిడిపి పై లావు కృష్ణదేవరాయలు షాకింగ్ కామెంట్స్

టిడిపి పై లావు కృష్ణదేవరాయలు షాకింగ్ కామెంట్స్

Published on Apr 24, 2024 2:17 PM IST

రానున్న ఎన్నికల కోసం ఇటీవల తాను చేపట్టిన బస్సుయాత్ర బుధవారం ముగియడంతో నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు వైసిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు తన కఠోరమైన పాదయాత్రలో చేసినట్లుగానే, ప్రత్యేక ఎన్నికల వాహనంపై వైఎస్‌ఆర్‌సిపి అధినేత హైవోల్టేజ్ తో మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల ముందుకి రాగా అది భారీ సంఖ్యలో జనాలను ఆకర్షించింది. జనసేన పార్టీ, బిజెపిలతో టిడిపి పొత్తులో కుట్రలను బహిర్గతం చేయడానికి, పార్టీ అభ్యర్థుల నుండి ప్రజల దృష్టిని జగన్ వైపుకు మళ్లించడానికి మరియు నష్టాన్ని ఎదుర్కోవడానికి బస్సు యాత్ర చాలా ఉపయోగపడుతోందని వైఎస్సార్‌సిపి వర్గాలు పేర్కొన్నాయి. 

కడపలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి శ్రీకాకుళం వరకు సాగిన మేమంతా సిద్ధం యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఎన్నో మార్గాల్లో సాగింది. ఆ విధంగా ఆయన తమ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ నేతృత్వంలోని కూటమి చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అధికార వ్యతిరేకతను అణిచివేసేందుకు జగన్ ఏం చేస్తారనేది ఫలితాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాగా జగన్ ఇప్పటికే తన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని ఇతర సురక్షితమైన స్థానాలకు మార్చారు మరియు 60% సిట్టింగ్ ఎంపీలను తొలగించారు. మొత్తంగా అయితే జగన్ అనౌన్స్ చేసిన స్థానాల్లోని అభ్యర్థులు అందరూ బలంగా ఉండడం ఒకింత కూటమి నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 

ఇక తాజాగా నరసరావుపేట టిడిపి అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీ పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులని బట్టి చూస్తుంటే కొంతమంది టీడీపీ నేతలు కూడా మున్ముందు టఫ్ ఫైట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోరాడే అవకాశం కోసం చాలా కష్టపడాలి. బీజేపీ మాతో జతకట్టింది కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయింది. రాష్ట్రంలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలి. ఎన్డీయే కూటమిలో కలిసిన అంతగా మేలు ఐతే ఏమి జరగలేదుని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడంతో షాక్ కు గురవుతున్నాయి టీడీపీ శ్రేణులు. ఆయన మాటలతో టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ లేదని ఇక్కడే అర్థమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు