ముద్రగడ చేరికతో వైసీపీకి మరింత బలం

ముద్రగడ చేరికతో వైసీపీకి మరింత బలం

Published on Mar 15, 2024 12:27 AM IST

Jagan_Mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ప్రజలకు సేవ చేసి మంచి పేరు అందుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు. తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే కుల రాజకీయాల నేపధ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారని, దీనికి నాదేండ్ల మనోహర్ సహకరించారనేది సత్యం. 

అయితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామ జోగయ్యలను పరోక్షంగా కామెంట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాపులకు అండదండగా ఉంటున్న ఆయన తాజాగా వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యా బలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది.

అలాగే కాపునేస్తం అందించి కాపు సామాజికవర్గంలో ఆర్దికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. అలాగే దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్ధులకు కేటాయించారు. కాపు నేస్తం తో ఎంతోమంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు. అయితే ఇపుడు పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్ల జనసేన వైపు మళ్లకుండా కాకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది. ఇక తాజాగా ముద్రగడ చేరిక వైసిపి కి ఎంతో మేలుని చేకూర్చే అవకాశం లేకేపోలేదని, తప్పకుండా ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు పలు రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు