విజయనగరం టిడిపిలో భగ్గుమన్న నిరసనలు

విజయనగరం టిడిపిలో భగ్గుమన్న నిరసనలు

Published on Mar 29, 2024 12:42 AM IST

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పలు ప్రధాన పార్టీలు అన్ని కూడా ఇప్పటికే సంసిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపితో పాటు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కూడా ఈసారి అధికారం కోసం గట్టిగా ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈసారి జనసేన, బిజెపితో కలిసి కూటమిగా టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూడు పార్టీలు తమ అభ్యర్ధులని ప్రకటించగా పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతలు కార్యకర్తల్లో నిరసన గళాలు వినపడుతున్నాయి. తాజాగా టిడిపి ప్రకటించిన తుది జాబితాతో విజయనగరం జిల్లాలో నిరసనలు గుప్పుమన్నాయి.

పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష పదవికి, చీపురపల్లి ఇన్ ఛార్జ్ పదవికి కిమిడి నాగార్జున రాజీనామా. నెల్లిమర్ల ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకి పార్టీ తీరని ద్రోహం చేసిందని పోలిపల్లిలో కార్యకర్తలు విస్తృత సమావేశం నిర్వహించారు. విజయనగరం. చీపురపల్లి టిక్కెట్టు జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కేటాయించకపోవటంతో కొనసాగుతున్న నిరసనలు. చీపురపల్లిలో టీడిపి ప్రచార సామగ్రిని దగ్ధం చేసిన నేతలు, కార్యకర్తలు. నాలుగు మండలాలకు చెందిన టిడిపి అధ్యక్షులు పార్టీ పదవులకు రాజీనామా చేసారు. దీనితో వారిని బుజ్జగించేందుకు టిడిపి అధిష్టానం రంగంలోకి దిగనున్నట్లు చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తంగా ఏపీలో రానున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు