వైసిపిలో చేరిన విజయవాడ టిడిపి, జనసేన నాయకులు

వైసిపిలో చేరిన విజయవాడ టిడిపి, జనసేన నాయకులు

Published on Mar 27, 2024 12:16 AM IST

గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రజల యొక్క ఆమోదంతో ఏకంగా 151 సీట్లు గెలుచుకున్న వైసిపి పార్టీ అప్పటి నుండి ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల యొక్క మెప్పు అందుకుని మరొక్కసారి ఏపీలో మంచి మెజారిటీ అందుకునే దిశగా కొనసాగుతోంది. ఇక నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభించారు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలని కలుసుకుని మరింత బలంగా పార్టీని వారికి చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

కాగా తాజాగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు అయిన బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి), గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు. అలానే విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు), వీరితో పాటు సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి. దీనితో తమ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, దానితో కూటమి నాయకుల్లో టెన్షన్ మొదలైందని, ఇక రాష్ట్రంలో ప్రజలు మరొక్కసారి వైసిపికి అధికారాన్ని అందించి జగన్ యొక్క సుభిక్ష పాలనని అందుకోవాలని కోరుకుంటున్నట్లు పలువురు వైసిపి నేతలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు