ఏపీ అంతటా ఎన్నికల ప్రచారానికి వైసిపి అధినేత జగన్ శ్రీకారం

ఏపీ అంతటా ఎన్నికల ప్రచారానికి వైసిపి అధినేత జగన్ శ్రీకారం

Published on Apr 24, 2024 10:51 PM IST

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రం అంతటా బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పూర్తి అయిన ఈ యాత్ర అనంతరం ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎన్నికల ప్రచార కాంపెయిన్ కి శ్రీకారం చుట్టారు. 

ఇక దాని తాలూకు షెడ్యూల్ నేడు విడుదలైంది. దాని ప్రకారం ఏప్రిల్ 28 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రచార యాత్ర 1 మే వరకు కొనసాగనుంది. అలానే ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. ఆయా ప్రాంతాల్లో పలు బహిరంగ సభలు నిర్వహించి స్థానిక నేతలతో సమావేశం కానున్నారు జగన్. 

గడచిన ఐదేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ ముందుకు సాగుతున్న జగన్, తప్పకుండా తమకు ప్రజల మద్దతు మరొక్కసారి లభిస్తుందని అంటున్నారు. ఇక ఈ ప్రచార యాత్ర తమ పార్టీకి మరింత మేలు చేస్తుందని, ఎక్కడికక్కడ సభల ద్వారా జగన్ సహా తమ క్యాడర్ మొత్తం కూడా ప్రజలతో మమేకమవుతుందని అంటున్నాయి వైసిపి వర్గాలు. ఇక ఆ ప్రచార యాత్ర యొక్క వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

28.04.2024:

ఉ. 10:00 గం.లకు : తాడిపత్రి
మ. 12:30 గం.లకు; వెంకటగిరి
మ. 08:00 గం.లకు: కందుకూరు

29.04.2024:

ఉ. 10:00 గం.లకు : చోడవరం
మ. 12:30 గం.లకు;  పి. గన్నవరం
మ. 08:00 గం.లకు:  పొన్నూరు

30.04.2024:

ఉ. 10:00 గం.లకు : కొండపి
మ. 12:30 గం.లకు; మైదుకూరు
మ. 08:00 గం.లకు: పీలేరు

01.05.2024:

ఉ. 10:00 గం.లకు : బొబ్బిలి
మ. 12:30 గం.లకు;  పాయకరావుపేట
మ. 08:00 గం.లకు: ఏలూరు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు