175 ఎమ్యెల్యే 25 ఎంపీ సీట్లకు వైసిపి పార్టీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ 

175 ఎమ్యెల్యే 25 ఎంపీ సీట్లకు వైసిపి పార్టీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ 

Published on Mar 16, 2024 12:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారపక్ష వైసీపీ పార్టీ నేడు 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ అభ్యర్థుల పేర్లను చదివి ప్రకటించారు. 

కొన్ని నెలలుగా పార్టీలోని పలువురు నాయకులు కార్యకర్తల యొక్క పనితీరుని పరిశీలించి జగన్ ఫైనల్ గా ఈ లిస్ట్ ని సిద్ధం చేసారు. ఇక ఈ లిస్ట్‌లో దాదాపుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా సామజిక న్యాయం ధ్యేయంగా వీరి ఎంపిక జరిగింది. అలానే గడచిన 2019 ఎన్నికల నాడు పోటీ చేసిన వారు, అలానే వారిలో గెలుపొందిన అంతరం చేసిన కార్యక్రమాలు, ప్రస్తుతం ప్రజల్లో వారి యొక్క ప్రాముఖ్యత, పనితీరుని అనుసరించి ఎంపిక చేసారు. ఇక మహిళలకు కూడా సమాన న్యాయం చేసేలా పలు ప్రాంతాల్లో మహిళలకు కూడా సీట్లు కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి. 

అలానే పోటీ చేస్తున్న వారి యొక్క విద్యార్హతని బట్టి కూడా వారి ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. చివరిగా పార్టీ క్యాడర్ అంతా కూడా సమిష్టిగా చర్చించి ఈ లిస్ట్ ని అందించడం జరిగిందని, నేడు ఈసీ ప్రకటించిన విధంగా మే 15న ఆయా ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులు పోటీ చేసి జూన్ 4న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయఢంకా మ్రోగించి మరొక్కసారి ఏపీలో అధికారాన్ని అందుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు