సమీక్ష :’చక్రవ్యూహం’ ది ట్రాప్ – ఆకట్టుకోని మర్డర్ మిస్టరీ

Ahimsa Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 02, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సురేష్ ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ తిరందాసు తదితరులు.

దర్శకులు : చిట్కూరి మధుసూదన్

నిర్మాతలు: సహస్ర క్రియేషన్స్

సంగీత దర్శకులు: భరత్ మాచిరాజు

సినిమాటోగ్రఫీ: జివి అజయ్ కుమార్

ఎడిటర్: జెస్విన్ ప్రభు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విలక్షణ నటుడు నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన తాజా సినిమా చక్రవ్యూహం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఆ మూవీ ఎలా ఉందో పూర్తి సమీక్షలో చూద్దాం.

 

కథ :

సంజయ్ రావు (వివేక్ త్రివేది) భార్య అయిన సిరి (ఊర్వశి పరదేశి) తన ఇంట్లో గొంతు కోసి చనిపోయి ఉంటుంది. అయితే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన ఎస్.ఐ. సత్య (అజయ్) మొదట సంజయ్‌ని దోషిగా భావిస్తాడు. అలాగే, సంజయ్‌రావుకు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన శరత్‌ని అనుమానిస్తాడు. ఇక హత్య తర్వాత ఇంట్లోంచి కోటి విలువైన నగదు, బంగారం పోవడంతో సిరి ఇంట్లో పనిచేసే పనిమనిషి పై కూడా సత్య అనుమానం వ్యక్తం చేశాడు. అసలు సిరిని ఎవరు చంపారు? సిరిని హత్య చేయడానికి హంతకుడిని ప్రేరేపించినది ఏమిటి? మరి నగదు, బంగారం ఎవరు దొంగిలించారు, ఆమెను ఎందుకు చంపారు అనే వాటికి సమాధానాలు కావాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఏమాత్రం ఆలస్యం లేకుండా సినిమా ప్రారంభం నుండి మెయిన్ పాయింట్ లోకి వెళ్తుంది. సిరి హత్యానంతరం ఎస్ ఐ సత్య రంగప్రవేశం చేసి అన్నివిధాలుగా హత్యకు గల కారణాలను అన్వేషిస్తుంటారు. ఈ సీన్స్ కొంతవరకు ఆకట్టుకునేలా ఉండడం తోపాటు తరువాత సినిమా ఏమి జరుగుతుంది అనే ఆసక్తి ఆడియన్స్ లో కలుగుతుంది. కాకపోతే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినా మంచి క్లైమాక్స్ తో అలరిస్తుంది. అజయ్, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ప్రగ్యా నయన్ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా కేవలం 110 నిమిషాల నిడివితో సాగడం ప్రధాన బలం. దురాశ దుఃఖానికి చేటు అనే సందేశాన్ని నిర్మాతలు ఈ సినిమా ద్వారా తెలియజేశారు.

 

మైనస్ పాయింట్స్ :

ప్రారంభ సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండడంతో సినిమా ఆకట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే కొన్ని సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల అనంతరం ఆ హైప్ ఏమాత్రం అందుకోలేక మెల్లగా ముందుకు సాగుతుంది. ఈ సన్నివేశాలు చప్పగా ఉంటాయి మరియు అదే సమయంలో చాలా బోరింగ్‌గా కూడా ఉంటాయి. సెకండాఫ్ మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు కొంత సిల్లీగా అనిపిస్తాయి. చాలా వరకు సినిమాలో లాజిక్ లేని కొన్ని ఓవర్ ది టాప్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. పెద్దగా కష్టపడకుండా కేసును ఛేదించిన అజయ్ క్యారెక్టరైజేషన్ మరింత బలంగా చూపించి ఉంటె బాగుండేదనిపిస్తుంది. సినిమా సాగుతున్న కొద్దీ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బలహీనపడతాయి. థ్రిల్లర్స్ కి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం, కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మేలు కంటే హాని ఎక్కువ కావచ్చు. ఈ విషయంలో కూడా చక్రవ్యూహం గాడి తప్పింది.

 

సాంకేతిక వర్గం :

సినిమాలో భరత్ మాచిరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉంది మరియు అది సీన్స్ తో చాలా వరకు సింక్ కాలేదు. జి వి అజయ్ కుమార్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగుంది, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు చెట్కూరి మధుసూధన్ విషయానికి వస్తే, అతను సినిమాతో పర్వాలేదనిపించారు. ప్రారంభ మరియు ముగింపు సీన్స్ చక్కగా ఆకట్టుకున్నాయి కానీ, మధ్యలో చాలా వరకు సీన్స్ ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తాయి. చక్రవ్యూహం వంటి ఆకట్టుకునే థ్రిల్లర్‌లకు గట్టి స్క్రీన్‌ప్లే ఉండాలి, కానీ ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ గా అలరించడంలో మాత్రం తడబడింది.

 

తీర్పు :

మొత్తంగా, చక్రవ్యూహం సినిమా ఆసక్తికరంగా సాగని థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ సినిమా బోరింగ్‌గా ఉంటుంది. నటుడు అజయ్ మరియు కొందరు కీలక నటులు బాగా చేసారు, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా సినిమా ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. అందువల్ల చక్రవ్యూహం ని నిరాశాజనకమైన మూవీగా చెప్పవచ్చు. ఈ వారాంతంలో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు అయితే దీనిపై ఒక లుక్ వేయవచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :