సమీక్ష : ఏకవీర – వీరత్వం చూపించలేకపోయిన ఏకవీర

విడుదల తేది : 2 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.25/5
దర్శకుడు : వసంత బాలన్
నిర్మాత : శ్రీనివాస్ దామెర
సంగిత డైరెక్టర్ : కార్తీక్
తారాగణం : ఆది, ధన్సిక, పశుపతి

‘ఒక విచిత్రం’ అనే సినిమాతో తెలుగు పరిచయమై ‘వైశాలి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి గారి అబ్బాయి ఆది హీరోగా, ధన్సిక హీరొయిన్ గా పశుపతి, భరత్, అంజలి, అర్చనా కవి, శ్వేతా మీనన్ ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏక వీర’. తమిళంలో రూపొందిన ‘అరవాన్’ అనే సినిమాని డబ్బింగ్ చేయగా ఈ చిత్రానికి వసంత బాలన్ దర్శకత్వం వహించారు. టి. శివ మరియు శ్రీనివాస్ దామెర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏక వీర చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ చిత్ర కథ 18వ శతాబ్దంలో దక్షిణ భారత దేశంలోని చిన్న వీరపాలెంలో అనే గ్రామంలోమొదలవుతుంది. ఆ వూరి పక్కనే ఉండే మార్టూరు మరియు చిన్న వీరపాలెం గ్రామస్తులకి ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. మార్టూరు గ్రామంకి చెందిన ఒక యువకుడు (భరత్) అర్ధరాత్రి చిన్న వీరపాలెంకి వచ్చి అక్కడే చనిపోవడంతో ఇరు గ్రామాలకి పెద్ద గొడవ జరిగి ఆ సమస్య ఇరు గ్రామాలను పాలించే రాజు (విజయ్ చందర్) గారి వద్దకు వెళుతుంది. సమస్య విన్న రాజు గారు ఆ యువకుడిని చిన్న వీరపాలెం గ్రామస్తులే చంపారని ఒప్పుకొని ఆ వూరు నుండి ఒకరిని మార్టూరు గ్రామానికి బలి ఇవ్వమని చెబుతాడు. ఈ సంధికి ఒప్పుకున్న ఇరు గ్రామస్తులు చిన్నా (ఆది) అనే యువకుడిని బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. చెయ్యని నేరానికి బలి కావడం ఇష్టం లేని చిన్నా ఆ యువకుడిని చంపింది ఎవరు అని తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఇంతకు ఆ యువకుడిని చంపింది ఎవరు? చివరికి చిన్నా బలి నుండి తప్పించుకున్నడా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

గ్రామ రక్షకుడిగా చిన్నా పాత్రలో, మరియు వీరపులి అనే దొంగగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆది బాగా నటించాడు. ముఖ్యంగా ఎద్దుతో పోరాడే కొన్ని పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించాడు. 18వ శతాబ్దపు యువకుడిగా అచ్చు గుద్దినట్లు సరిపోయాడు. దొంగతనం చేసే సన్నివేశాల్లో బాగా చేసాడు. సాంబయ్య (పశుపతి) కీలక పాత్ర పోషించాడు. దాదాపు చిత్ర మొదటి భాగం అంతా సాంబయ్య మీదే నడుస్తుంది. దొంగ నటించిన పశుపతి బాగా నటించాడు. చిన్నా భార్య పాత్రలో మల్లి (ధన్సిక) చిన్న పాత్ర అయిన పరవాలేదనిపించింది. విజయ్ చందర్ కీలకమైన రాజు పాత్ర పోషించాడు.

మైనస్ పాయింట్స్:

స్వాతంత్రానికి పూర్వం భారత దేశంలో బలి దానం అనే మూఢ నమ్మకం ఉండేది. అదే కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కథనం రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. చిత్ర మొదటి భాగం వరకు కొంత ఎంటర్టైన్ చేస్తూ సాగినా రెండవ భాగం వచ్చేసరికి హీరో పాత్ర చేయడానికి ఏమీ లేకుండా చేసాడు. చిత్రం కూడా విషాదాంతం కావడం తమిళ ప్రేక్షకులకు నచ్చినా తెలుగు ప్రేక్షకులు అది జీర్ణించుకోలేని విషయం. సినిమాలో అంజలి, భరత్, శ్వేతా మీనన్, అర్చన కవి లాంటి నటులు ఉన్నా ఒక్కరికి కూడా సరైన పాత్ర ఇవ్వకుండా వృధా చేసారు. కార్తీక్ సంగీతం సినిమాకి మరో పెద్ద మైనస్. ముఖ్యంగా చిత్ర రెండవ భాగంలో వచ్చే పాటలు సహనాన్ని పరీక్షిస్తాయి. కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా బాగా మైనస్ గా మారింది. చిత్ర మొదటి భాగం అంతా ఒక విధంగా ఉంటే రెండవ భాగం మాత్రం మొదటి భాగానికి ఏ మాత్రం సంభంధం లేని కొత్త పాత్రలతో సాగుతూ రెండు సినిమాలు చూస్తున్నామా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఎడిటింగ్ అంతా గందరగోలంగా ఉంది. సిద్ధార్థ్ అందించిన సినిమాటోగ్రఫీ18వ శతాబ్దానికి తగ్గట్లుగా అడివి అందాలను బాగా చిత్రీకరించాడు. సింగర్ గా ఎన్నో పాటలు పాడిన కార్తీక్ మొదటి సారి మ్యూజిక్ డైరెక్టర్ గా మారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవలేదనిపించినా పాటలు మాత్రం సహనాన్ని పరీక్షించాయి. శ్రీ రామకృష్ణ రాసిన డైలాగులు పరవాలేదు.

తీర్పు:

పూర్తిగా తమిళ నేటివిటీతో తీసిన సినిమా. సరదాగా గడుపుదామని వెళితే మీరు నిరుత్సాహానికి గురవుతారు. విషాదం తో కూడిన ముగింపు ఉండటంతో ఎవ్వరికీ నచ్చదు.

123తెలుగు.కాం రేటింగ్ : 2.25/5

అశోక్ రెడ్డి .ఎమ్

Clicke Here For ‘Ekaveera’ English Review

సంబంధిత సమాచారం :

More