సమీక్ష : ఏం చేస్తున్నావ్ – స్లోగా సాగే రొటీన్ కథా చిత్రం

సమీక్ష : ఏం చేస్తున్నావ్ – స్లోగా సాగే రొటీన్ కథా చిత్రం

Published on Aug 26, 2023 3:03 AM IST
Gandeevadhari Arjuna Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 25, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్ రాజ్‌కుమార్, నేహా పఠాన్, అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల మరియు ఇతరులు.

దర్శకుడు : భరత్ మిత్ర

నిర్మాత: నవీన్ కురువ, కిరణ్ కురువ

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: ప్రేమ్ అడివి

ఎడిటర్: హరీష్ శంకర్ టి ఎన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాన్, అమిత రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏం చేస్తున్నావ్ నేడు ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

సాయి ( విజయ్ కుమార్) తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక మాములుగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అతని చుట్టుప్రక్కల వారు అందరూ కూడా నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ అతడిని తరచు అడుగుతూ ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో ఒక రెస్టారెంట్ ఓనర్ అయిన రియా నక్షత్ర ప్రేమలో పడతాడు సాయి. కాగా తనకు ఉన్న రెస్టారెంట్స్ లో ఒకదానిని చూసుకోమని రియా కోరడం, అనంతరం దానిని సక్రమంగా చూసుకోవడంలో సాయి ఫెయిల్ అవడంతో అది వారిద్దరి ప్రేమ బ్రేకప్ కి దారి తీస్తుంది. రెండేళ్ల అనంతరం శ్రేష్ఠ (అమిత రంగనాథ్) సహాయంతో తన కెరీర్ లో స్థిరపడతాడు సాయి. మరి ఇంతకీ ఈ శ్రేష్ఠ ఎవరు, అతడికి ఏమవుతుంది, అతడి జీవితంలో ఆమె ఎటువంటి మార్పు తీసుకువచ్చింది, మరి ఈ రెండేళ్ల పాటు సాయి ఏమి చేసాడు అనే ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఏం చేస్తున్నావ్ మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ మధ్యలో అమిత రంగనాథ్ ఎంట్రీ తో ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్ నోట్ లో సాగుతుంది. తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆమె సినిమాని ఇంట్రెస్టింగ్ గా ముందుకు నడుపుతుంది. అలానే ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగా ఎలివేట్ అవడంతో పాటు ఎమోషన్స్ కూడా బాగుంటాయి. నూతన నటుడు అయినప్పటికీ హీరో విజయ్ కుమార్ బాగా పెర్ఫార్మ్ చేసాడు. తన డైలాగ్ డెలివరీ సహజంగా ఉండడంతో పాటు కామెడీ, ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలానే ఈ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నేహా పఠాన్ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. నటీనటుల పెర్ఫార్మన్స్ లు బాగున్నా కథనం బాగోదు. నేటి యువత యొక్క మనోభావాలకు అద్దం పట్టేలా సీన్స్ ఉన్నప్పటికీ వాటిని మరింత ప్రతిభావంతంగా తెరకెక్కించి ఉంటె ఫస్ట్ హాఫ్ మరింత బాగుండేది. ఒక సంఘటన తర్వాత సాయి జీవితం సాగె విధానం విచిత్రంగా అనిపించింది, ఇక్కడే సినిమా సమస్యల్లో పడింది. సమస్య గణనీయమైన సమయం వరకు కొనసాగుతుంది మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఏమాత్రం ఉత్సాహాన్ని కలిగించదు. నిజానికి సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ గా ఉండదు, అయితే మరొక హీరోయిన్ అయిన అమిత ఎంట్రీ తో పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు, మొత్తంగా ఈ సినిమా ఆడియన్స్ ని అలరించదు అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం :

గోపి సుందర్ అందించిన సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా బాగుంది. ప్రేమ్ అడివి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ధ తీసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ మూవీ అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు భరత్ మిత్ర ఎంచుకున్న పాయింట్ బాగున్నా దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో మాత్రం విఫలం అయ్యారు.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే ఏం చేస్తున్నావ్ మూవీ యొక్క కథాంశం బాగున్నా దానికి తగ్గట్లుగా సాగె కథనం ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే చాలావరకు వచ్చే సన్నివేశాలు అలరించవు. మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రమే కొంతవరకు సినిమాలో బాగున్నాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు