సమీక్ష : ‘నన్ను దోచుకుందువటే’ – హాయిగా సాగిపోతుంది

సమీక్ష : ‘నన్ను దోచుకుందువటే’ – హాయిగా సాగిపోతుంది

Published on Sep 21, 2018 10:38 PM IST
Nannu Dochukunduvate movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : సుదీర్ బాబు, నభ నటేష్, నాజర్ తదితరులు

దర్శకత్వం : ఆర్ ఎస్ నాయుడు

నిర్మాతల : సుదీర్ బాబు

సంగీతం : బి ఎ లోకనాథ్

స్క్రీన్ ప్లే : ఆర్ ఎస్ నాయుడు

ఎడిటింగ్ : చోటా కే.ప్రసాద్

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పై హీరోగా నటిస్తూ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాభ నటేష్ కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కార్తీక్ (సుదీర్ బాబు) చాలా ఫోకస్డ్ గా చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. తన గోల్ కోసం..ఎప్పుడు కష్టపడే స్వభావం ఉన్న ఎంప్లాయ్. అలాంటి వ్యక్తి అమెరికా వెళ్లి.. తన గోల్ ని ఎలాగైనా సాధించాలని కలలు కంటూ.. ప్లాన్ చేసుకుంటుంటాడు. కానీ తన గోల్ కి అడ్డుగా అన్నట్టు అతనికి అతని పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలో ఆ పెళ్లి సంబంధాలు నుంచి తప్పించుకోవడానికి కార్తీక్, మేఘన (నభ నటేష్)అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ని తన గర్ల్ ఫ్రెండ్ గా పేరెంట్స్ కి పరిచయం చేస్తాడు.

ఇలా కొన్ని పరిణామాల అనంతరం కార్తీక్ మేఘన పరిచయం స్నేహంగా, ఆ స్నేహం కాస్త ప్రేమాగా మారుతుంది. కానీ కొన్ని సంఘటనల కారణంగా కార్తీక్ మేఘనను దూరంగా పెట్టాలని భావిస్తాడు. కార్తీక్ మేఘనను దూరం పెట్టాల్సిన ఆ సంఘటనలు ఏమిటి ? అసలు కార్తీక్ తన గోల్ రీచ్ అవుతాడా ? చివరికి కార్తీక్ మేఘన ఎలా కలుసుకుంటారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సుధీర్ బాబు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశాడు.

తెలుగులో తొలిసారి కథానాయకిగా నటించిన నాభ నటేష్ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్ లో కనిపించిన నాభ మంచి ప్రతిభను కనబర్చింది. ఆమె తదుపరి చిత్రాల్లో కూడా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటే, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.

తండ్రి పాత్రలో నటించిన నాజర్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. సెకండాఫ్ లో కూడా సరదాగా నడుపుతూనే కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు. సినిమాలో హీరో పాత్రను పెద్దగా ఎమోషన్ లేకుండా నడుపుతూ సినిమాలో కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి దర్శకుడు కథను చూపించిన విధానం బావుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి భాగం ఎంటర్టైన్ గా సాగిన[, రెండువ భాగం మాత్రం అక్కడక్కడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దర్శకుడు రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం కొంత వరకు లోపించిన ఫీలింగ్ కలుగుతుంది.

తండ్రి కొడుకుల సంబంధాన్ని మరింతగా మంచిగా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం తన శైలిలోనే కథనాన్ని నడిపాడు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు రాసుకున్న కథను అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపొతే ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. లోకనాథ్ అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

చోట కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని సుదీర్ బాబు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా సింపుల్ అండ్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను మెప్పించింది. మొదటి భాగంలో వచ్చే సున్నితమైన సన్నివేశాలు మరియు ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ఇక హీరోయిన్ నాభ నటేష్ కూడా తన స్క్రీన్ ప్రజెన్స్ తో గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. నటన పరంగా కూడా ఆమె సినిమాకుచాలా ప్లస్ అయింది.

కాకపోతే ఈ సినిమా ట్రీట్మెంట్ నెమ్మదిగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీయడం, ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో సందేహం లేదు.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు