సమీక్ష : కడలి – నిరాశ పరిచిన కడలి

సమీక్ష : కడలి – నిరాశ పరిచిన కడలి

Published on Feb 2, 2013 3:45 AM IST
Kadali1 విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, ఎ. మనోహర్ ప్రసాద్
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
నటీనటులు : గౌతమ్, తులసి, అర్జున్, అరవింద్ స్వామి

రావన్ పరాజయం తరువాత మణిరత్నం చాలా కాలం గ్యాప్ తీసుకుని చేసిన ‘కడలి’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఒకప్పటి హీరో, హీరోయిన్లు కార్తీక్, రాధ వారసులు ఈ సినిమాతో పరిచయం కాబోతుండటం, అరవింద్ స్వామి దాదాపు ఆరేళ్ళ తరువాత మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో సినీ అభిమానులు సినిమా పై కొంత క్రేజ్ వచ్చింది. అర్జున్, లక్ష్మి మంచు ఇతర పాత్రల్లో రెహమాన్ సంగీతం రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ ఇలా అత్యున్నతస్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన కడలి తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదలైంది. మరి ఈ కడలి ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో బెర్క్ మాన్స్ అలియాస్ మీసాల దొర (అర్జున్), సామ్ (అరవింద్ స్వామి) ఇద్దరూ విద్యార్ధులు. ఒకరోజు అనుకోకుండా జరిగిన సంఘటనలో బెర్క్ మాన్స్ మీద సామ్ కంప్లైంట్ చేస్తాడు. దాంతో చర్చి నుండి బెర్క్ మాన్స్ ని గెంటేస్తారు. అక్కడి నుండి వెళ్ళిపోయిన బెర్క్ మాన్స్, సామ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తరువాత సామ్ ఒక సముద్ర తీరప్రాంత ఏరియాకి చర్చి ఫాదర్ గా వస్తాడు. సామ్ ప్రార్ధనలు, ప్రవర్తన నచ్చి ఆ వూరిలో ఉండే ప్రజలు ఆయనని బాగా నమ్మడం మొదలు పెడతారు. అక్కడే దొరికిన అనాధ పిల్లాడు థామస్ (గౌతమ్ కార్తీక్) ని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. కొంత కాలం తరువాత ఒకరోజు బెర్క్ మాన్స్ సామ్ కలుస్తాడు. బెర్కామ్స్ వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. బీట్రిస్ (తులసి) ని థామస్ ప్రేమిస్తాడు. సామ్ మీద పగ తీర్చుకోవడానికి థామస్ ని పావు లాగా వాడుకోవలనుకుంటాడు బెర్క్ మాన్స్. సామ్ మీద బెర్క్ మాన్స్ పగ తీర్చుకున్నడా? థామస్, బీట్రిస్ మధ్య ప్రేమ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే కడలి!

ప్లస్ పాయింట్స్ :

కడలి చిత్ర కథ ముఖ్యంగా సామ్, బెర్కామ్స్ పాత్రల మధ్యే ఎక్కువగా నడుస్తుంది. సామ్, బెర్క్ మాన్స్ పాత్రల్లో అరవింద్ స్వామి, అర్జున్ కరెక్టుగా సరిపోయారు. విలన్ పాత్రలో అర్జున్ అయితే బాగా చేసాడు. తన పాత్రని మరింత బలంగా చూపించడానికి సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు. అరవింద్ స్వామికి ఇలాంటి పత్రాలు చేయడం కొట్టిన పిండి. అర్జున్, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు మణిరత్నం స్టైల్లో బాగా వచ్చాయి. గౌతమ్ కార్తీక్ పాత్ర పరిధి మేరకు బాగానే చేసాడు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర. లక్ష్మి మంచు చాలా చిన్న పాత్ర చేసింది.

మైనస్ పాయింట్స్ :

మణిరత్నం సినిమాలు స్లోగా ఉంటాయి కానీ కడలి మరింత స్లోగా సాగింది. అరవింద్ స్వామి చెప్పే నీతి వాఖ్యాలు సహనాన్ని పరీక్షించాయి. అర్జున్, అరవింద్ స్వమి మధ్య వివాదాన్నే ఎక్కువ చూపించాడు. గౌతమ్, తులసి మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా తక్కువగా ఉండటం, అది కూడా ఆసక్తికరంగా లేకపోవడం, తులసి పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉండటంతో యువతని ఆకట్టుకోలేకపోయింది. తులసి కూడా హైప్ ఇచ్చినంత లేకపోవడం పెద్ద మైనస్. మణిరత్నం సినిమాల్లో ఉండే రొమాంటిక్ ఎలిమెంట్స్ మచ్చుకి కూడా కనిపించవు. కామెడీ లాంటి కమర్షియల్ అంశాలు లేకపోగా మణిరత్నం సినిమాల్లో ఉండే మేజిక్ పూర్తిగా మిస్ అయింది. ఒక దశలో ఇది మణిరత్నం తీసిన సినిమానా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంత ఆసక్తికరంగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టించింది. రెగ్యులర్ సినిమా లవర్స్ కోరుకునే అంశాలు ఏమీ ఇందులో లేవు. క్రిస్టియన్ మత భోధనలు ఎక్కువగా ఉండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

కడలి అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో తెరకెక్కింది. రెహమాన్ సంగీతం గత చిత్రాల స్థాయిలో కాకపోయినా బాగానే ఆకట్టుకుంది. గుంజుకున్నా, పచ్చని తోట, యాడికే పాటలు అధ్బుతమైన కోరియోగ్రఫీతో ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా బావుంది. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అధ్బుతమనే చెప్పాలి. సముద్ర తీరాన్ని చాలా బాగా చూపించాడు. మణిరత్నం గత చిత్రాల లాగే సినిమాటోగ్రఫీ బావుంది. డైలాగ్స్ తమిళ్ డైలాగులని తెలుగులోకి తర్జుమా చేసినట్లు ఉన్నాయి. సాహిత్యం కూడా అంతంతమాత్రమే.

తీర్పు :

మణిరత్నం సినిమాలు ఇష్టపడే వారు కడలి నుండి కూడా అదే ఆశించి వస్తే నిరాశ పడతారు. రెగ్యులర్ సినిమాల లవర్స్ కి నచ్చే అంశాలు ఏమీ లేకపోగా మణిరత్నం అభిమానులని కూడా నిరాశ పరిచారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

అనువాదం : అశోక్ రెడ్డి

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు