సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్

prema-katha-chitram2 విడుదల తేదీ : 07 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : J.ప్రభాకర్ రెడ్డి
నిర్మాత : మారుతి, సుదర్శన్ రెడ్డి
సంగీతం : జె.బి
నటీనటులు : సుదీర్ బాబు, నందిత …


సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిదిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తన రెండవ చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్’ తో తన లక్ ని పరీక్షించు కోవడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి కథని అందించటంతో పాటు, దర్శకత్వ పర్యవేక్షణ భాద్యతలు కూడా చేపట్టాడు. నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో జె. ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా మారాడు. ఇంతకీ ఈ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సుధీర్(సుధీర్ బాబు), ప్రవీణ్(ప్రవీణ్), నందు(నందిత)లానే ముగ్గురు యంగ్ స్టర్స్ లైఫ్ లో బాగా దెబ్బతిని డిప్రెషన్ స్టేజ్ లో ఉంటారు. వారి వారి జీవితాలతో విసుగెత్తిపోయి ఉన్న వీరు ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి చివరి రోజుల్ని హ్యాపీగా గడపాలని ఫార్మ్ హౌస్ కి బయలుదేరుతారు. మార్గ మధ్యంలో వారితోపాటు గిరి(గిరి) జాయిన్ అవుతాడు.

అలా ఫార్మ్ హౌస్ చేరుకొని వారి చివరి రోజుల్ని ఎలా ఉండాలా అని ప్లాన్ చేసుకుంటారు. ఆ టైంలో అందరూ అనుకున్నట్టు గానే సుధీర్, నందు మధ్య ప్రేమ పుడుతుంది. వారిద్దరూ ఎప్పుడైతే ఒకటవ్వాలని అనుకుంటారో అదే టైములో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం మొదలవుతాయి.

సుధీర్, తని స్నేహితులు ఆ ఫార్మ్ హౌస్ కి ఏదో సీక్రెట్ స్టొరీ ఉందని తెలుసుకుంటారు. అప్పుడే కథలో ఆ భయంకరమైన గతం తెలుస్తుంది. అసలు అక్కడ ఏమేమి జరిగాయా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో సుధీర్ తన ఫ్రెండ్స్ కి కూడా వేరే ఆశయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంతకీ ఆ ఫార్మ్ హౌస్ వెనుక దాగున్న నిజా నిజాలు ఏమిటి? చివరికి సుధీర్, అతని ఫ్రెండ్స్ కి ఏమైంది? అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో సుదీర్ బాబు నటన బాగుంది. ఈ సినిమాలోని ఎమోషినల్, భయపడే సీన్స్ లలో తను చాలా చక్కగా నటించాడు. ఈ సినిమాలో డాన్స్ చేసిన విదానం చూస్తే ఆయనికి డాన్స్ లపై మంచు పట్టు ఉందని తెలుస్తుంది. ఈ సినిమాకి అసలు సిసలైన స్టార్ అంటే నందిత. ఆమె బిహేవియర్ అలాగే సీన్స్ కి తగ్గట్టు ఆమె నటనలో మార్పులను చాలా బాగా పలికిందింది. కొన్ని సీన్స్ లో తను చాలా అందంగా ఉంది.

ప్రవీణ్ గోదావరి యాసలో మాట్లాడి ప్రేక్షకులని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. గిరి రెండు సన్నివేశాలలో చాలా చక్కగా నటించాడు. ‘సూపర్ నాచురల్ ఫోర్స్’ తో మాట్లాడటం మరియు ‘ద్రౌపది వస్త్రాపహరణం’ సన్నివేశాలలో బాగా నవ్వించాడు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ శాతం చాలా ఎక్కువగా ఉంది. చాలా తెలివిగా హాస్యాన్ని, హర్రర్ ని, రొమాన్స్ ని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూడింటికి ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు.

ఫుల్ కామెడీగా ఉండడం, చాలా వేగంగా సాగే సెకండాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ . మాములుగా మారుతీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఔన్తాయి కానీ ఈ సినిమాలో లిమిటెడ్ గా ఉన్నాయి. అంత వల్గర్ గా అనిపించవు. ఈ సినిమాకి రీ – రీకార్డింగ్ ఒక పెద్ద ప్లస్. సౌండ్, కెమెరా యాంగిల్స్ ని ఉపయోగించిన విధానం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మొదటి 20-30 నిముషాలు చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని అవసరంలేని సన్నివేశాలు ఉన్నాయి ఉదాహరణకి ఎమ్మెల్యే నిద్రపోవడం లాంటి సీన్స్వు, మొదలైనవి. ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకునికి చిరాకు తెప్పిస్తాయి. సినిమా చివరిలో వచ్చే ఫైటింగ్ సన్నివేశాలు అనవసరంగా పెట్టారు. కథాపరంగా ఆ ఫైట్ అవసరం లేదు. అది కేవలం సుదీర్ ఫైట్స్ కూడా చేయగలడు అని చెప్పడానికే పెట్టినట్టుగా ఉంది. సినిమా పరంగా చేర్చిన కొన్ని సీన్స్ కూడా అంత బాలేవు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా సినిమాటోగ్రఫీ బాగుంది. హారర్/థ్రిల్లర్ సినిమాలలో సౌండ్, కెమెరా యాంగిల్స్ బాగుండాలి. ఈ రెండు ఈ విభాగాలను చాలా బాగా హండిల్ చేశారు. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది. జెబీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సౌండ్ మిక్సింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం బాగుంది కానీ సన్నివేశాలలో మారుతి స్టాంప్ కనిపించింది. ఈ సినిమాతో మారుతికి మంచి పేరుని తీసుకొస్తుంది.

తీర్పు :

మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
అనువాదం : రాఘవ

Click here for English Review

సంబంధిత సమాచారం :