సమీక్ష : శైలజా రెడ్డి అల్లుడు – ముగ్గురు ఇగోల కథ

సమీక్ష : శైలజా రెడ్డి అల్లుడు – ముగ్గురు ఇగోల కథ

Published on Sep 14, 2018 12:22 PM IST
Shailaja Reddy Alludu movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్య కృష్ణ

దర్శకత్వం : మారుతీ

నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : గోపీ సుందర్

సినిమాటోగ్రఫర్ : నిజార్ షఫీ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతీ తెరకెక్కించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

చైతన్య (నాగ చైతన్య ) పెద్ద ఈగోస్ట్ అయినా రావు (మురళీ శర్మ) కుమారుడు. కాగా చైతు అను (అను ఇమ్మాన్యుయేల్ )ను చూసిన క్షణంలోనే ఆమెతో ప్రేమలో పడుతాడు. అను కూడా చైతుని ప్రేమిస్తుంది. కానీ ఆమెకు వున్నా ఇగో కారణంగా ఆ విషయం చైతుకి చెప్పదు. ఆ క్రమంలో చైతు అనును మార్చి.. తన ప్రేమను చెప్పి.. ఇద్దరు ఒక్కటవుతారు. చైతు తండ్రి రావుకి తనలాగే అను కూడా ఇగోయిస్టు పర్సన్ అవ్వడం నచ్చుతుంది. దాంతో వారిద్దరి పెళ్లికి ఒప్పుకుంటాడు. అనుకోకుండానే ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తాడు.

అయితే ఈవిషయం అను తల్లి (శైలజారెడ్డి)కి తెలియనివ్వకుండా జరుగుతుంది. వూరి పెద్ద అయిన శైలజారెడ్డి (రమ్య కృష్ణ ) అనుకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటుంది. శైలజారెడ్డి కూడా పెద్ద ఇగోయిస్టు పర్సన్ కావడంతో.. ఇక చేసేది ఏమిలేక.. ఎలాగైనా శైలజారెడ్డి ని ఒప్పించాలని చైతు ఆమె ఇంటికి వస్తాడు. మరి చైతు ఆమెను ఒప్పించాడా ? చైతు అను పెళ్లి చేసుకుంటారా ? చేసుకుంటే ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎదురుకున్న పరిస్థితులు ఏమిటి ? అనేది మిగితా కథ .

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు బలం నాగ చైతన్య ప్రాత చైతు పాత్ర లో చైతన్య ఆకట్టుకున్నాడు . డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ లుక్ తో చాలా కొత్తగా కనిపించాడు. సినిమా అంత ఫుల్ యాక్టీవ్ గా కనిపించాడు. ఇక ఇగో వున్న అను పాత్రలో అను బాగా నటించింది.

శైలజారెడ్డి అత్త పాత్రలో నటించిన రమ్య కృష్ణ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. మురళి శర్మ పాత్ర కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. నిజమైన ఇగోయిస్టు పర్సన్ ఎలావుంటాడో ఈ సినిమాలో ఆయనను చుస్తే అలాగే అనిపిస్తుంది.

ఇక రైజింగ్ కమెడియన్ వెన్నెల కిశోర్ చాలా చోట్ల నవ్వించాడు. దర్శకుడు మారుతీ మనుషుల మధ్య ఇగో లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనే కథను బాగానే తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ లో తన పట్టు చూపించాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి .
మైనస్ పాయింట్స్ :

మనిషికి ఇగో ఎక్కువతే ఎలాంటి సమస్యలు వస్తాయో అనే మారుతీ రాసుకున్న ఈ కథ దాన్ని పూర్తి స్థాయిలో తెర మీదకు తీసుకరాలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల బోర్ కొట్టించాడు. హీరో ,హీరోయిన్ లవ్ ట్రాక్ తో ఇంకా బాగా ఎంటర్టైన్ చేసే అవకాశం వున్నా దాన్ని ఉపయోగించుకోలేదు.

ఇక తన గత చిత్రాల్లో వెన్నెలకిషోర్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన మారుతీ ఈ చిత్రంలో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఇగో కాన్సెప్ట్ తో ఫుల్ కామెడీ ని జనరేట్ చేసే అవకాశం వున్నా ఆ అవకాశాన్ని ఉపయోగించులకోలేదు . సెకండ్ హాఫ్ లో బలమైన సన్నివేశాలు లేకపోవడం , ఎమోషనల్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వుండి సెకండ్ హాఫ్ లో బలమైన ఎమోషనల్ ట్రాక్ వుండి ఉంటే ఈ సినిమా వేరే స్థాయిలో ఉండేదే.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మారుతీ రాసుకున్న కామెడీ పెద్దగా ఆసక్తిగా లేకపోయినా కథనంతో ఆ ఫీల్ ను పోగొట్టే ప్రయత్నం చేశాడు . దాంట్లో చాల వరకు విజయం సాధించాడు. ఇక నిజార్ షఫీ అందించిన ఛాయా గ్రహణం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ను చాల రిచ్ గా చూపెట్టారు .

గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. సిట్యువేషనల్ సాంగ్ శైలజారెడ్డి అల్లుడు చూడే సాంగ్ వినడానికి బాగుంది.

కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి .

తీర్పు :

ఇగో కాన్సెప్ట్ తో.. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నటీనటుల పరంగా సాంకేతిక నిపుణుల పరంగా పర్వాలేదనిపించుకుంటుంది. ముఖ్యంగా నాగ చైతన్య నటన మరియు లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ప్రధానంగా కామెడీ బలం అవ్వగా.. రొటీన్ గా సాగే సన్నివేశాలు, బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగే కథనం సినిమాకు మైనస్ గా నిలిస్తాయి. మొత్తం మీద ‘శైలజారెడ్డి అల్లుడు’ కొంతవరకు బాగానే ప్రేక్షుకులను ఎంటర్టైన్ చేస్తుంది. మరి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు