సమీక్ష : జవాన్ – హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ !

Jawan Movie Review in Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 7, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె (ప్రత్యేక పాత్ర) ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య, సంజయ్ దత్ (అతిధి పాత్ర) తదితరులు.

దర్శకుడు : అట్లీ

నిర్మాతలు: గౌరీ ఖాన్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు

సహా నిర్మాత : గౌరవ్ వర్మ

ఎడిటర్: రూబెన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పఠాన్‌తో, కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ కింగ్ సైజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక తాజాగా అట్లీ దర్శకత్వంలో నేడు జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఆజాద్ (షారుఖ్‌ ఖాన్) ఒక జైలర్. సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గురైన మహిళా ఖైదీలకు గైడ్ గా, మెంటర్ గా మారి.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అందుకు అనుగుణంగా తన టీమ్ తో కలిసి సంఘ విద్రోహ పనులు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ సంఘటనలు ఏమిటి ?, మరోవైపు ఆజాద్ టీమ్ ను పట్టుకోవడానికి ఆఫీసర్ నర్మదా (నయనతార) టీమ్ చేసే ప్రయత్నం ఏమిటి ?, చివరికి ఆజాద్ టీమ్, నర్మదా నుంచి ఎలా తప్పించుకుంటుంది ?, అసలు ఆజాద్ ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు ?, ఇంతకీ విక్రమ్ రాథోడ్ (షారుఖ్‌ ఖాన్) ఎవరు ?, విక్రమ్ రాథోడ్ గతం ఏమిటి ?, విక్రమ్ రాథోడ్ – ఆజాద్ మధ్య సంబంధం ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

భారీ అంచనాలతో వచ్చిన జవాన్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మరియు గుడ్ మెసేజ్ తో సాగే గ్రాండ్ యాక్షన్ అండ్ ఎమోషన్ విజువల్స్ తో చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్ మరియు కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. అలాగే, విక్రమ్ రాథోడ్ పాత్రలోని షేడ్స్ ను, షారుఖ్ ఖాన్ – నయనతార మధ్య సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని సీనియర్ షారుఖ్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు అట్లీ చాలా బాగా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా ఆజాద్ (యంగ్ షారుఖ్) పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు కూడా విశేషంగా అలరిస్తాయి. ఇక ఆజాద్ – విక్రమ్ రాథోడ్ పాత్రలకు షారుఖ్ ఖాన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుఖ్ ఖాన్ – దీపికా పడుకోణె ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి కూడా చాలా బాగా నటించాడు. సంజయ్ దత్ అతిధి పాత్రలో మెరిశారు.

ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్‌ గా నటించారు. యోగి బాబు నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అట్లీ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై అట్లీ పెట్టిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. ముఖ్యంగా అట్లీ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్ గా ఎమోషన్స్ అండ్ మెసేజ్ చాలా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

జవాన్ కథలో డెప్త్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా విజయ్ సేతుపతి పాత్ర కూడా ఇల్లాజికల్ గా సాగుతుంది. దీనికి తోడు కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. అయితే, దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు అట్లీ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

 

తీర్పు :

హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘జవాన్’ చాలా బాగా ఆకట్టుకుంది. షారుఖ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు షారుఖ్ కామెడీ టైమింగ్, మరియు మెయిన్ కథలోని మెసేజ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే, కొన్ని రివెంజ్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. షారుఖ్ ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలను ఇస్తోంది. అలాగే మిగిలిన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :