సమీక్ష : ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ – ఆకట్టుకోని పొలిటికల్ థ్రిల్లర్

విడుదల తేదీ : జనవరి 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, ఆహానా కుమ్రా

దర్శకత్వం : విజయ్ రత్నకర్ గుట్టే

నిర్మాతలు : సునీల్ బొహ్రా, ధావల్ గడ

సంగీతం : సుమిత్ సేథి

సినిమాటోగ్రఫర్ : సచిన్ కృష్ణన్

ఎడిటర్ : ప్రవీణ్ కె. ఎల్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ రోజు ఈచిత్రం యొక్క తెలుగు వెర్షన్ విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

2004 లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించడం తో ఈ చిత్రం మొదలవుతుంది. మన్మోహన్ సింగ్ యొక్క అధికార ప్రతినిది సంజయ్ బారు (అక్షయ్ ఖన్నా) నియమించబడుతాడు . కాంగ్రెస్ పార్టీ నుండి అనేక అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ వాటిని తట్టుకొని ఎలా నిలబడ్డాడు అలాగే అలాగే దేశంకోసం ఆయన ఎలాంటి ఉత్తమమైన నిర్ణయాలు తీసుకున్నారు లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మన్మోహన్ సింగ్ పాత్రలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటన ఈ చిత్రానికి మేజర్ ప్లస్ అయ్యింది. ఆయన నడక మాట తీరు అచ్చం మన్మోహన్ లాగానే ఉండడంతో స్క్రీన్ ఫైచూస్తున్నంత సేపు బాగా అనిపిస్తుంది. అనుపమ్ , మన్మోహన్ ఇమిటేట్ చేయడంలో చాలా వరకు విజయం సాధించారు.

ఇక అలాగే అక్షయ్ ఖన్నా పాత్రా కూడా ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచింది. ప్రభుత్వం ఎలా నడుస్తుంది, అంతర్గతంగా ఏం జరుగుతుంది మరియు మన్మోహన్ సింగ్ ఎందుకు తన అనుకున్నది సంపూర్ణంగా చేయలేకపోయాడన్నది ఈ పాత్రా ద్వారా వివరించారు. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా చాలా బాగా నటించారు.

ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే న్యూక్లియర్ డీల్ కు సంబందించిన విశేషాలను బాగా చూపెట్టడంలో దర్శకుడు విజయం సాధించాడు.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ ని తెర మీదకు తీసుకురావడంలో దర్శకుడు చాలా చోట్ల తడబడ్డాడు. గ్రిప్పింగ్ గా లేని సన్నివేశాలు ఈ చిత్రానికి మేజర్ మైనస్ అయ్యాయి. అలాగే ఫస్ట్ హాఫ్ ను మంచి పాయింట్ తో ఎండ్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో పూర్తిగా పట్టుకోల్పోయాడు.

మన్మోహన్ సింగ్ ఎందుకు ప్రధాన మంత్రి పదివి కి రాజీనామాచేయాల్సి వచ్చింది అలాగే రాహుల్ గాంధీ ను 2014 ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి గల కారణాలను ఆసక్తిగా చూపెట్టలేకపోయాడు. దాంతో సెకండ్ హాఫ్ బోరింగ్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ విజయ్ రత్నాకర్ ఇలాంటి ఒక సబ్జెక్టు ను ఎంచుకొని సాహసమే చేశాడు కానీ దాన్ని పూర్తి స్థాయిలో తెర మీదకు తీసుకురాలేకపోయాడు. గ్రిప్పింగ్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా మలచిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను మాత్రం ఆసక్తికరంగా రాసుకోలేకపోయాడు. ఇక సుమిత్ సేథీ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ఈచిత్రాన్ని ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరించడంఅలాగే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించడం కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు.

ఇక ఎడిటింగ్ కూడా క్రిప్సీ గా వుంది. అయితే డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రధ్ద వహిస్తే బాగుండేది. మాటలు ఏమంత ప్రత్యేకంగా అనిపించవు. సచిన్ కృష్ణ్ అందించిన ఛాయా గ్రహణం చాలా బాగా వుంది సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది.

తీర్పు :

మొత్తంమీద ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే సీనిమాతో సాహసోపేత ప్రయత్నం చేసిన దర్శకుడు దాన్ని ఎంగేజింగ్ గా చూపెట్టలేకపోయాడు. అనుపమ్ ఖేర్ మరియు అక్షయ్ ఖన్నా నటన ఈ చిత్రంలో హైలైట్ అవ్వగా వాస్తవాలను చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అవ్వడం అలాగే గ్రిప్పింగ్ గా లేని నరేషన్ సినిమాకు మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం మన్మోహన్ సింగ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే వారికీ మాత్రం నచ్చే అవకాశాలు వున్నాయి. మిగితా వారికీ మాత్రం ఈ చిత్రం కనెక్ట్ అవ్వదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More