Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : త్రిపుర – హర్రర్ మిస్ అయిన థ్రిల్లర్

Tripura review

విడుదల తేదీ : 06 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రాజ్ కిరణ్

నిర్మాత : ఎ. చినబాబు – ఎం. రాజశేఖర్

సంగీతం : కమ్రాన్

నటీనటులు : స్వాతి, నవీన్ చంద్ర, పూజ రామచంద్రన్..

టాలీవుడ్ లో ఈ మధ్య నిర్మాతలకు కాసులు తెచ్చిపెడుతున్న జానర్ హర్రర్ కామెడీ.. అదే తరహాలోనే హర్రర్ కామెడీకి థ్రిల్లర్ ని కూడా జత చేస్తూ చేసిన ‘త్రిపుర’ ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగమ్మాయి స్వాతి టైటిల్ రోల్ లో నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమాకి గత ఏడాది గీతాంజలి అని హర్రర్ కామెడీతో మెప్పించిన రాజ్ కిరణ్ డైరెక్టర్. కోన వెంకట్ – వెలిగొండ శ్రీనివాస్ లు కథ సహకారం కథనం అందించిన ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని భయపెట్టింది, ఎంతవరకూ నవ్విస్తూ థ్రిల్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్ లోని ఓ ఫాం హౌస్ లో ఈశ(పూజ రామచంద్రన్)ని చంపేసి ఆ శవాన్ని మాయం చేస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే వరాహపట్నం అనే ఓ పల్లెటూరిలో ఈ సినిమా మొదలవుతుంది. త్రిపుర(స్వాతి) అమాయకత్వం, అల్లరి కలగలిపిన అమ్మాయి. చిన్నప్పటి నుంచీ త్రిపురకి తన చుట్టూ ప్రక్కల జరగబోయే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి అలానే రియల్ లైఫ్ లో నిజం అవుతుంటాయి. అలాంటి త్రిపురకి ట్రీట్ మెంట్ ఇప్పించడం కోసం హైదరాబాద్ కి తీసుకెళ్తారు. అక్కడ తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నవీన్ చంద్ర(నవీన్ చంద్ర) – త్రిపురలు ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకుంటారు.

మొదట్లో త్రిపుర డ్రీమ్స్ గురించి నమ్మని నవీన్ ఒక రెండు ఇన్సిడెంట్స్ తర్వాత నమ్మడం మొదలు పెడతాడు. దానికి కారణం త్రిపుర నవీన్ చంద్రనే పొడిచినట్టు కల రావడం. ఇదిలా ఉండగా ఒకప్పుడు నవీన్ చంద్ర – ఈశ కలిసి పనిచేసిన డాక్టర్స్. కొద్ది రోజుల నుంచి ఈశ కనపడకపోవడంతో దాంతో ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ తిలక్ వస్తాడు. తిలక్ మొదటి నుంచి నవీన్ చంద్రని అనుమానిస్తుంటాడు. ఈశ కేసు వల్ల, త్రిపుర కలల వల్ల నవీన్ చంద్ర లైఫ్ పలు ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి నవీన్ చంద్ర ఎలా భయటపడ్డాడు.? అసలు ఈశని నవీన్ చంద్రనే చంపాడా.? లేక వేరే ఎవరన్నా చంపారా.? అలాగే త్రిపుర కలగనట్టు తన చేతులతోనే నవీన్ ని పోడిచేసిందా.? అనే అంశాలను మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన ప్లస్ పాయింట్.. హర్రర్ కామెడీ కథాంశానికి ఓ మంచి థ్రిల్లింగ్ పాయింట్ ని జతచేయడమే.. హైలైట్ అని ఎందుకు అన్నాను అంటే సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే చివర్లో వచ్చే 15 నిమిషాలు సినిమాకి హైలైట్ అయ్యింది. ఇకపోతే సినిమాకి మొదటి 20 నిమిషాలు బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చే ట్విస్ట్ ఎపిసోడ్ బాగుంది. దానితో పాటు సినిమా మధ్య మధ్యలో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ సినిమాకి బాగానే హెల్ప్ అవుతాయి.

నటీనటుల్లో ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది ముగ్గురు.. వాళ్ళే స్వాతి, నవీన్ చంద్ర మరియు పూజ రామచంద్రన్. టైటిల్ రోల్ పోషించిన స్వాతి త్రిపుర అనే పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మొదట్లో అమాయకత్వం, అల్లరి చేసే అమ్మాయిలా కనిపిస్తూ మెప్పిస్తే, తర్వాత తన కలల ద్వారా భయపడే హావభావాలను చాలా బాగా పలికించింది. ఇక చివర్లో స్వాతి చేసిన దెయ్యం సీన్ లో మాత్రం సూపర్బ్ గా చేసింది. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో స్వాతికి పర్ఫెక్ట్ సపోర్ట్ ని ఇస్తూ సినిమాని నడిపించాడు. తనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు తను చేసిన నటనే సినిమాకి హెల్ప్ అయ్యింది. చిన్న పాత్ర చేసినా పూజ రామచంద్రన్ మాత్రం చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో స్వాతి – పూజ కాంబినేషన్ సీన్ సూపర్బ్. శకలక శంకర్ – సప్తగిరి – జయప్రకాశ్ రెడ్డిలు సెకండాఫ్ లో కాస్త నవ్వించారు. ఇది కాకుండా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. సినిమా మొదట్లో పెళ్లి కొడుకులా ధనరాజ్ కాసేపు నవ్వించి వెళ్ళిపోయాడు. రావు రమేష్, శ్రీమాన్ తదితర నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.

మైనస్ పాయింట్స్ :

త్రిపుర అనే సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ నెరేషన్.. ఎందుకంటే సినిమా నెరేషన్ మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడా ఆడియన్స్ కి సినిమా వేగంగా వెళ్తున్న ఫీలింగ్ కలగదు. దానికి తోడు సినిమా రన్ టైం కూడా 151 నిమిషాలు ఉండడం వలన సినిమాని మరీ సాగదీస్తున్న ఫీలింగ్ వస్తుంది. నెరేషన్ తర్వాత కథనం గురించే చెప్పుకోవాలి. ఉన్న ఒక ట్విస్ట్ ని మొదట్లో రైజ్ చేయడం మరియు దానికి క్లైమాక్స్ లో రివీల్ చేయడం బాగానే ఉంది. కానీ సినిమా మొదలైన కొద్ది సేపటి నుంచీ చివర్లో ట్విస్ట్ రివీల్ చేసే దాకా నెక్స్ట్ ఏం జరుతుందా అనే సస్పెన్స్ ని క్రియేట్ చేయాలి కానీ అలాంటి ఆసక్తిని ఆడియన్స్ లో క్రియేట్ చేయలేకపోయింది కథనం.

ఇక నెగటివ్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సింది మొదటి నుంచి బిల్డప్ ఇచ్చుకుంటా వచ్చిన జరగబోయేది ముందుగానే కలలు కాన్సెప్ట్ గురించి అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా మొత్తాన్ని దాని మీదే నడిపించి చివర్లో ఆ విషయం పై క్లారిటీ ఇవ్వకుండా సృష్టిలో సైన్స్ కి అందనివి కొన్ని ఉంటాయి అని ముగించేయడం అర్ధరహితంగా ఉంటుంది. ఇక చెప్పుకోవాల్సింది కామెడీ గురించి సినిమాలో మీరు బాగా నవ్వుకునే కామెడీ అంశాలు అస్సలు లేవు. సప్తగిరి చేలా సేపు కనిపించినా తన చేత చేయించిన కామెడీ రొటీన్ అనే పదానికే రొటీన్ అనిపించేలా ఉన్నాయి. అందుకే ఇందులో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వర్క్ అవుట్ అయిన ఒకే ఒక్క ఎపిసోడ్ కూడా ప్రేమకథా చిత్రమ్, రాజుగారి గది సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇక సినిమాలో వచ్చే పాటలని సింపుల్ గా కట్ చేసేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే డ్యూయెట్ అస్సలు అవసరం లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సింది రవికుమార్ సానా సినిమాటోగ్రఫీ. ప్రతి విజువల్ ని చాలా బాగా చూపించాడు. విజువల్స్ పరంగా సినిమా అయితే చాలా క్వాలిటీగా, కలర్ఫుల్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీకి తగ్గట్టుగానే ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక కమ్రాన్ అందించిన మ్యూజిక్ ఓకే, నేపధ్య సంగీతం కూడా ఓకే ఓకే అనేలా ఉందే తప్ప ఓ సూపర్బ్ అని చెప్పుకునేంత అయితే లేదు. ఉపేంద్ర ఎడింగ్ ఇకా చాలా బెటర్ గా ఉండాల్సింది. చాలా సీన్స్ సాగుతున్నా ఆయన అలానే వదిలేయడం సినిమాకి మైనస్ అయ్యింది. సిజి వర్క్ బాగుంది. రాజా డైలాగ్స్ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి.

త్రిపుర సినిమాకి కోన వెంకట్ – వెలిగొండ శ్రీనివాస్ లు కలిసి కథనం రాసారు. ఉన్న ట్విస్ట్ ని లాస్ట్ లో రివీల్ చేసేలా బాగానే రాసినా, మిగతా సినిమా అంతా చూసే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేలా రాయకపోవడం సినిమాకి మైనస్ గా మిగిలింది. సినిమాకి కథ – దర్శకత్వం అందించిన రాజ్ కిరణ్ విషయానికి వస్తే.. కథ కోసం అనుకున్న పాయింట్ ఓకే కానీ కథని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు పాత్రలకి రాసుకున్న ప్రతి పాయింట్ ని క్లియర్ గా చెప్పాలి, కానీ కథలో చెప్పలేదు. ఇక దర్శకుడిగా నటీనటులతో పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నా, సినిమా నేరేషన్ ని స్పీడ్ గా ఉండేలా చూసుకోవడం, ఆద్యంతం ఆడియన్స్ కి కథని హుక్ చేసి ఉంచడంలో ఫెయిల్ అయ్యాడు.

తీర్పు :

టాలీవుడ్ లో సక్సెస్ మంత్రగా మారిన హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘త్రిపుర’ సినిమా అక్కడక్కడా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, స్టార్ట్ టు ఎండ్ చూసుకుంటే మాత్రం మెప్పించలేకపోయింది. హర్రర్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసుకున్న ఈ సినిమాలో థ్రిల్లింగ్ బాగున్నా, హర్రర్ అనేది చాలా తక్కువగా ఉండడం సినిమాని కాస్త డౌన్ చేసింది. సినిమా ప్రారంభం, ముగింపు బాగున్నప్పటికీ మిగతా అంతా బోరింగ్ గా, చాలా స్లోగా సాగడం, బలవంతంగా ఇరికించిన కామెడీ అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడం వలన ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాకి మెయిన్ లీడ్స్ అయిన స్వాతి, నవీన్ చంద్ర, పూజ రామచంద్రన్ ల పెర్ఫార్మన్స్ తో పాటు క్లైమాక్స్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఆడియన్స్ ని థ్రిల్ చేయడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. స్లో నేరేషన్, కథనం, రన్ టైం, అలాగే మెయిన్ పాయింట్ కి క్లారిటీ ఇవ్వకుండా వదిలేయడం చాలా పెద్ద మైనస్. ఓవరాల్ గా సినిమా కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఒక మంచి కిక్ ఇచ్చే థ్రిల్ తో సినిమాని ఎండ్ చేస్తే చాలు అనుకునేవారు హ్యాపీగా ఈ సినిమాని చూడచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :