800 మిలియన్ వ్యూస్ తో “జయ జానకీ నాయక” హిందీ వెర్షన్!

800 మిలియన్ వ్యూస్ తో “జయ జానకీ నాయక” హిందీ వెర్షన్!

Published on Feb 20, 2024 7:52 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జయ జానకీ నాయక. ఈ చిత్రం 2017 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, అద్దిరిపోయే రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 800 మిలియన్స్ కి పైగా హిందీ వెర్షన్ కి వ్యూస్ వచ్చాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు