ప్రముఖ నటి శ్రీదేవి కన్నుమూత !
Published on Feb 25, 2018 9:15 am IST

ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్ను మూశారు. నిన్న రాత్రి ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకుగాను ఆమె కుటుంబంతో కలిసి దుబాయి వెళ్లారు. అక్కడే ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిన్న రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు శ్రీదేవి మరిది సంజయ్ కపూర్ తెలిపాడు. ఆమె మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌ సంఘటనా స్థలంలో ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీదేవి 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించడం జరిగింది. వివిధ భాషల్లో నటించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ‘మా నాన్న నిర్దోషి’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీదేవి దాదాపు సీనియర్ హీరోలతో నటించింది. 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి హిందీ లో 71, తెలుగులో 85, తమిళంలో 71, కన్నడలో 6, మలయాళంలో 26 చిత్రాల్లో నటించారు.2017లో చివరిగా ‘మామ్‌’ చిత్రంలో నటించారు. శ్రీదేవి మృతి పట్ల 123 తెలుగు ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.

 
Like us on Facebook