ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన ‘అదిరింది’ !
Published on Oct 25, 2017 11:44 am IST

ఇటీవలే తమిళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న విజయ్ చిత్రం ‘మెర్సల్’ తెలుగులో సైతం రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత ఎట్టకేలకు సెన్సార్ పనుల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ నెల 27 అనగా రాబోయే శుక్రవారం నాడు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ సమర్పిస్తున్నారు. కాజల్, సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల్ని తప్పుబట్టేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ప్రస్తుతం వివాదాలు నడుస్తున్నాయి.

 
Like us on Facebook