విజయ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలువనున్న ‘అదిరింది’ !
Published on Nov 12, 2017 12:07 pm IST

ఇలయదళపతి విజిట్ నటించిన ‘మెర్సల్’ చిత్రం తమిళనాట భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అదిరింది’ పేరుతో గత గురువారం విడుదల చేశారు. సామాజిక సమస్యను ఎత్తుచూపుతూ మంచి కమర్షియల్ అంశాలతో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్న ఈ సినిమానికి మొదటి రోజు నుండే పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది.

విజయ్ గత చిత్రాలు ‘తుపాకీ, పోలీసోడు’ మంచి విజయాల్ని సాధించడంతో ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక శుక్ర, శనివారాల్లో కూడా లాభదాయకమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఈరోజు ఆదివారం మరింత మెరుగైన రన్ ను చూపించనుంది. ఈ కలెక్షన్లు చూస్తుంటే తెలుగునాట విజయ్ కెరీర్లో ఉత్తమమైన వసూళ్లను సాధించే చిత్రంగా అదిరింది’ నిలవనుందని స్పష్టమవుతోంది. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులోకి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పించింది.

 
Like us on Facebook