డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన అడివి శేష్ “హిట్2”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన అడివి శేష్ “హిట్2”

Published on Dec 20, 2022 10:13 AM IST

అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2వ కేసు డిసెంబర్ 2, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకోవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే త్వరలో అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు. రావు రమేష్, కోమలి ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకం పై నిర్మించడం జరిగింది. ఎంఎం శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు