లండన్లో మొదలుకానున్న అఖిల్ సినిమా !
Published on May 16, 2018 9:15 am IST


అక్కినేని అఖిల్ మూడవ సినిమా పనులు చక చకా జరిగిపోతున్నాయి. గత నెలలో లాంచ్ అయిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ప్రస్తుతం చిత్ర టీమ్ లోకేషన్ల వేట కోసం లండన్ వెళ్ళింది. వారు తిరిగిరాగానే హీరో హీరోయిన్లతో సహా చిత్ర యూనిట్ మొత్తం మళ్ళీ లండన్ వెళ్లి ఈ నెల 29 నుండి అక్కడే షూట్ మొదలుపెట్టనున్నారు.

‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటించనుందని తెలుస్తున్నా దర్శక నిర్మాతల నుండి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు