మీరు ఎంత ఊహించారో అంతకంటే ఎక్కువ ఉంటుంది బంగార్రాజు…మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో నాగార్జున కీలక వ్యాఖ్యలు!

Published on Jan 9, 2022 10:59 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం జనవరి 14 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం నిర్మించడం జరిగింది. ఈ చిత్రం జనవరి 14 న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న సందర్భం గా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అంతేకాక తాజాగా బంగార్రాజు మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొనడం జరిగింది.

ఈ వేడుక లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేక పోయాను. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోస్ కి చాలా ముఖ్యమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది జనవరి 14 న. 50 సంవత్సరాల క్రితం నాన్న గారు దసరా బుల్లోడు అనే చిత్రం తో దుమ్ము లేపారు.జనవరి 14 న. అది సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ బంగార్రాజు కు చక్కటి మాస్, కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. ప్రతి సాంగ్ ఒక వజ్రం.మొదటి పాట నుండి అన్ని చాలా బావున్నాయి. 6 పాటలు సూపర్ హిట్. తెలుగు పాటలు ఉండే వరకూ సాహిత్యం అలా ఉంటూనే ఉంటుంది. అలానే మ్యూజిక్ అలానే ఉంటుంది. మీరు ఎంత ఊహించారో అంతకంటే ఎక్కువ ఉంటుంది సినిమా. జనవరి 11 న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నాం, 14 వ తేదీన సినిమా ను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించండి. థాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :