ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఫేవరేట్ హీరో ప్రభాస్ అట..!

Published on Apr 2, 2020 7:08 am IST

బాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతుంది అలియాభట్. ఆమె చేతిలో ఉన్నవి అన్నీ బడా చిత్రాలే. హిందీలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయి చిత్రంతో పాటు రన్బీర్ కపూర్ కి జంటగా బ్రహ్మాస్త్ర అనే భారీ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా చేస్తుంది. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఈమె చరణ్ కి జంటగా నటిస్తుంది. రామరాజు ప్రేయసి సీత పాత్రలో ఈమె కనిపించనుంది. కాగా టాలీవుడ్ నుండి ఈమె ఫేవరేట్ స్టార్ ఎవరని అడుగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

టాలీవుడ్ లో అలియాభట్ కి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అట. ఆయన నటించిన బాహుబలి చూశాక ఆయనకు ఫ్యాన్ అయిపోయిందట. టాలీవుడ్ నుండి నాకు బాగా నచ్చిన హీరోలలో ప్రభాస్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన గత చిత్రం సాహో తెలుగులో మిశ్ర ఫలితాలు అందుకోగా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :

X
More