అల్లరి నరేష్ నెక్స్ట్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్… అద్దిరిపోయిందిగా!

Published on May 10, 2022 12:55 pm IST


నాంది లాంటి ఇంటెన్స్ డ్రామా తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో అల్లరి నరేష్, ప్రస్తుతం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం తో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నరేష్ మరోసారి హిట్ సబ్జెక్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ గాయాలతో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చాలా ఇంటెన్స్ గా, ఆసక్తికరం గా ఉంది. మంచం కాలు పట్టుకొని ఉన్న నరేష్ ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాజ్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో శ్రీదేవి సోడా సెంటర్ ఫేం ఆనంది హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ పతాకాల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :