పుష్ప ప్రమోషన్స్ ను మొదలెట్టనున్న బన్నీ!

Published on Nov 26, 2021 1:00 am IST


ఇకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ పేరిట మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసేందుకు సిద్దం అయింది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి మరికొన్ని అప్డేట్స్ రానున్నాయి అంతేకాక అల్లు అర్జున్ ఈ చిత్రం ప్రమోషన్స్ ను చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More