‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ ఆ రోజే !

Published on Oct 25, 2018 9:16 pm IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ ను అక్టోబర్ 29న సాయంత్రం 4గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది.

సంబంధిత సమాచారం :