భారతీయ సినీ రంగంలో ఇద్దరు లెజెండ్స్ ను కలవడం ఆనందంగా ఉంది – అమిత్ షా

Published on Mar 18, 2023 12:00 am IST


భారతీయ చలనచిత్ర రంగం లో ఇద్దరు లెజెండ్స్ ను (మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) కలవడం ఆనందం గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు యూనియన్ సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా. తెలుగు సినిమా పరిశ్రమ భారత దేశ సంస్కృతి మరియు ఆర్ధిక వ్యవస్థ ను గణనీయంగా ప్రభావితం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు మరియు RRR మూవీ చిత్రం విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను ఈ మేరకు అభినందించారు అమిత్ షా. వీటితో పాటుగా చిరు మరియు చరణ్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

అమిత్ షా చేసిన పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఈ మేరకు రామ్ చరణ్ ఈ పోస్ట్ పై రెస్పాండ్ అయ్యారు. ఈరోజు అమిత్ షా ను మీట్ అయినందుకు చాలా ఆనందం గా ఉంది. RRR టీమ్ యొక్క ఎఫర్ట్స్ ను అభినందించినందుకు థాంక్స్ అని తెలిపారు చరణ్.

సంబంధిత సమాచారం :