విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ఠ, తారక్ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ, అప్సర్, శ్రీనివాస్ వడ్లమాని, నాయుడు కాడ్రేగుల మరియు ఇతరులు
దర్శకత్వం : ఖగేష్ తమ్మినేని
నిర్మాతలు : కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
సంగీతం : దవ్‌జంద్
ఛాయాగ్రహణం : మాయావీ
కూర్పు : శ్రీకృష్ణ అట్లూరి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అనకాపల్లి’. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ :
అనకాపల్లికి చెందిన సూర్య (విక్రమ్ సహిదేవ్) సరదాగా తిరుగుతూ కాలేజీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఐతే, అదే అనకాపల్లిలో ఉన్న భయంకరమైన నేర స్వభావం కలిగిన బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ని చూసి సూర్య అతన్ని రోల్ మోడల్ గా తీసుకుంటాడు. అతని నేర ప్రపంచంలోకి సూర్య కూడా అడుగుపెడతాడు. ఇలా పవర్, క్రైమ్ బాటలో వెళ్తున్న సూర్య జీవితంలోకి అమృత (సంధ్య వసిష్ఠ) ఎంట్రీ ఇస్తోంది. తొలిచూపులోనే సూర్య, అమృతతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అమృతని ప్రేమలో పడేయడానికి సూర్య రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందుకు బుల్లెట్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. మొత్తానికి, అమృతకి సూర్య దగ్గర అవుతాడు. ఆమె కూడా అతనికి దగ్గర అవుతున్న క్రమంలో.. అమృత – బుల్లెట్ తో క్లోజ్ గా కనిపిస్తోంది. అసలు వాళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి ?, వాళ్ళను క్లోజ్ గా చూసిన సూర్య ఎలా రియాక్ట్ అయ్యాడు ?, అనంతరం సూర్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ?, చివరకు అమృత కోసం సూర్య ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఓ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, క్రైమ్ చుట్టూ సాగిన ఈ అనకాపల్లి సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే, మదర్ సెంటిమెంట్ డైలాగ్స్ అండ్ ప్రీ-క్లైమాక్స్ బాగున్నాయి. మొత్తానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే ఓ కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుంది ?.. ఈ మధ్యలో వచ్చే ఎమోషన్స్ మరియు కొన్ని ఫ్యామిలీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో విక్రమ్ సహిదేవ్ నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన సంధ్య వసిష్ఠ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. మరో కీలక పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప నటన చాలా బాగుంది.
అదేవిధంగా తండ్రి పాత్రలో త్రినాథరావు నక్కిన నటన కూడా బాగుంది. తల్లిగా కనిపించిన ఇంద్రజ ఆకట్టుకుంది. శ్రీనివాస్ వడ్లమాని, నాయుడు కాడ్రేగులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. రచయితగా త్రినాథరావు నక్కిన రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ అనకాపల్లి కథలో ఇంటర్వెల్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో త్రినాథరావు నక్కిన విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు.
‘విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ఠ’ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. హీరో పాత్రకి, హీరోయిన్ పాత్రకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా.. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఖగేష్ తమ్మినేని దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించాడు. ఐతే, స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు దవ్‌జంద్ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా కండ్రేగుల నాయుడు & త్రినాథరావు నక్కిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు:
‘అనకాపల్లి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ క్రైమ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


