సమీక్ష : తత్వం – కొంతవరకే ఎంగేజ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : తత్వం – కొంతవరకే ఎంగేజ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

Published on Oct 2, 2026 3:35 PM IST


విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : దినేష్ తేజ్, దాస్విక కింతాలి, సుక్కు రెడ్డి, ఆనంద్ భారతి, జబర్దస్త్ కృష్ణ తదితరులు
దర్శకత్వం : అర్జున్ కోలా
నిర్మాతలు : శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి
సంగీతం : చేతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : భరత్ పట్టి
కూర్పు : విప్లవ్ నైషదం

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఒక గ్రామీణ నేపథ్యం, మర్డర్ మిస్టరీ, దాని వెనుక ఉన్న నమ్మకాల చుట్టూ తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘తత్వం’. దినేష్ తేజ్, దాస్విక జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

కళ్యాణ్ (దినేష్ తేజ్) ఒక సాధారణ కానిస్టేబుల్. ఎస్సై కావాలనే ఆశయంతో ఉన్న అతను పెళ్లి చూపుల కోసం రామాపురం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సౌమ్య (దాస్విక)ను చూసి ఇష్టపడతాడు. అయితే, కళ్యాణ్ రాకతోనే ఆ ఊరిలో ఊహించని దారుణం జరుగుతుంది. ఊళ్లోని మూర్తి, నాగమణి అనే దంపతులు దారుణంగా హత్యకు గురవుతారు.
మానసిక ఎదుగుదల లేని వారి కొడుకు సుధనే ఈ హత్యలు చేశాడని గ్రామస్థులంతా భావించి అతడిని బంధిస్తారు. పరిస్థితిని బట్టి ఈ హత్యా కేసును విచారించే బాధ్యత కళ్యాణ్ చేతికి వస్తుంది. సుధ అమాయకుడని సౌమ్య బలంగా నమ్మడంతో, కళ్యాణ్ అసలు నిజాలను వెలికితీసేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. నిజంగా ఆ హత్యలు చేసింది ఎవరు? ఈ హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీని కళ్యాణ్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

హీరోగా దినేష్ తేజ్ నెమ్మదిగా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ లోనూ తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కానిస్టేబుల్ పాత్రలో చాలా నేచురల్‌గా కనిపిస్తాడు.

పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న మిస్టరీ కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలకమైన ట్విస్టులు, క్లైమాక్స్ రివీల్ ఆకట్టుకుంటాయి.

చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ఎలిమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. మూడ్‌ని క్యారీ చేయడంలో ఆర్ఆర్ ముఖ్య పాత్ర పోషించింది.

మైనస్ పాయింట్స్:

సినిమాకు అతిపెద్ద లోపం పేసింగ్. ఫస్టాఫ్ చాలా నిమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో ప్రధాన కథలోకి వెళ్లడానికి టైమ్ పడుతుంది.

క్రైమ్ థ్రిల్లర్స్‌కు కావలసిన గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కొన్ని సీన్స్ ముందే ఊహించేలా ఉండటం నిరాశపరుస్తుంది.

ఎడిటర్ విప్లవ్ కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించి ఉంటే సినిమా స్పీడ్ పెరిగి రన్‌టైమ్ మరింత క్రిస్పీగా ఉండేది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు అర్జున్ కోలా ఎంచుకున్న రూరల్ మర్డర్ మిస్టరీ పాయింట్ బాగున్నా, దానిని తెరపైకి తీసుకురావడంలో ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. భరత్ పట్టి కెమెరా వర్క్ గ్రామీణ వాతావరణాన్ని నాచురల్‌గా ఆవిష్కరించింది. చేతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకి ప్లస్ గా నిలిచింది. నిర్మాణ విలువలు కథకు సరిపడా ఉన్నాయి.

తీర్పు:

మొత్తంగా చూస్తే, ‘తత్వం’ ఒక క్రైమ్ మిస్టరీ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రంగా ప్రేక్షకులను కొంతవరకే మెప్పిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ లో ఉండాల్సిన అంశాలు పుష్కలంగా ఉండటం, నటీనటుల పెర్ఫార్మన్స్, టెక్నికల్ వర్క్ ఈ సినిమాకు ప్లస్. అయితే, స్లోగా సాగే కథనం మరియు కొన్ని సాగదీత సన్నివేశాల వల్ల పూర్తిస్థాయి ఎంగేజ్‌మెంట్‌ను ఇవ్వలేకపోయింది. థ్రిల్లర్ జానర్ చిత్రాలు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు