సమీక్ష: తెల్ల కాగితం – రొటీన్ యూత్ ఫుల్ డ్రామా

సమీక్ష: తెల్ల కాగితం – రొటీన్ యూత్ ఫుల్ డ్రామా

Published on Oct 2, 2026 6:02 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 02, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : హర్ష్ రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్ తదితరులు
దర్శకత్వం : రమేష్ బండ్రెడ్ది
నిర్మాతలు : కృష్ణ కొమ్మాలపాటి
సంగీతం : విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం : కె.వి.గుహన్
కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన పలు సినిమాల్లో కుర్ర హీరో హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం కూడా ఒకటి. మరి ఈ సినిమా కూడా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

రాము (హర్ష్ రోషన్), ఆశా (నక్షత్ర) అనే ఇద్దరు టీనేజర్లు తమ స్కూల్ వయసు నుంచే ఒకరకంటే ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. అయితే, ఈ యువ జంట చేసిన ఒక పొరపాటు వారి జీవితాలను పూర్తిగా తలకిందులు చేస్తాయి. ఇక అక్కడస్ నుంచి వీరికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు వారు చేసిన ఆ పొరపాటు ఏంటి? చివరికి వారేం తెలుసుకున్నారు అనేది ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కామెడి ఇందులో బాగా వర్కవుట్ అయ్యింది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి.

హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. దీపక్ మాలి తో తన సీన్స్ బాగా వచ్చాయి.

అలాగే యువ నటి నక్షత్ర ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తను సినిమా అంతటా కాన్ఫిడెంట్ గా కనిపించి, డీసెంట్ డెబ్యూ ఇచ్చింది. ఆమె తండ్రి పాత్రలో అజయ్ పర్వాలేదనిపించాడు.

మైనస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో యూత్ కోసం వస్తున్న సినిమాలు ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాయి. యువత జీవితంలోని నెగిటివ్ కోణాలను, చెడు స్నేహాల వల్ల వారు ఎలా ప్రభావితమవుతారు అనే విషయాలను చూపించి, చివరకు ఒక మెసేజ్ తో ముగించడం. ఇదే కనిపిస్తుంది. ఇక ఈ ఫార్మాట్ లోనే ‘తెల్ల కాగితం’ కూడా అనిపిస్తుంది. దీని స్క్రీన్ ప్లే కూడా అదే ఫార్ములా టెంప్లేట్ ను ఫాలో అవుతుంది.

దీనితో, సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో ముందే ఊహించే విధంగా ఉంటుంది. ఇలా కథనం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక అసలు సమస్య సెకండ్ హాఫ్ లో వస్తుంది. కొంచెం ఫన్ గా సాగిన తర్వాత సెకాండాఫ్ మాత్రం సాగదీతగా బోరింగ్ గా అనిపిస్తుంది. నిడివి కొంచెం తగ్గించాల్సింది.

అలాగే చివర్లో హీరో సోదరుడికి, అజయ్ కి మధ్య జరిగే ముఖ్యమైన సంభాషణ అర్థవంతంగానే అనిపిస్తుంది, కానీ ఆ సీన్ కి దారితీసే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. హర్ష్ రోషన్, శరణ్య ప్రదీప్ ల మధ్య ఉన్న బంధం మీద సినిమా ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే, ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా బాగుండేది. కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందికరంగా అనిపించవచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. అండర్ రేటెడ్ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మరోసారి తన వర్క్ తో ఇంప్రెస్ చేశారు. పాటలు, నేపథ్య సంగీతం కూడా బాగుంది. కె.వి. గుహన్ కెమెరా వర్క్ బాగుంది, కానీ ఎడిటింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

ఇక దర్శకుడు రమేష్ బండ్రెడ్డి విషయానికి వస్తే, తన పనితనం కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది. సినిమాలో ఉన్నట్లుగా క్లైమాక్స్ లేకపోతే, అది యువత పొరపాట్లు చేయడానికి ప్రోత్సహించేలా తప్పుడు సంకేతాలను పంపేది. అయితే, సెకండ్ హాఫ్ కూడా ఫస్టాఫ్ లా ఆకట్టుకునేలా ఉంటే బాగుణ్ణు. అలాగే రన్ టైం పై కూడా కేర్ తీసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే, ‘తెల్ల కాగితం’ ఒక రొటీన్ యూత్ ఫుల్ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కథనం ఓకే కానీ సెకాండాఫ్ లో మాత్రం కథనం నెమ్మదించింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ అంతే ఇబ్బంది పెట్టాయి. యువ జంట బాగానే పెర్ఫామ్ చేశారు. సెకండాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దీనితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు