రూమర్లను నమ్మొద్దంటున్న అనిల్ రావిపూడి !
Published on Oct 26, 2017 12:34 pm IST

ఇటీవలే రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేసి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తర్వాత సినిమా ఏమిటనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నైపథ్యంలో ఆయన హీరో నితిన్ తో ఒక సినిమాను ప్లాన్ చేశారని, నితిన్ కథ విని ప్రాజెక్టును ఓకే చేసేశారని వార్తలొచ్చాయి. ఆ వార్తలు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

దీంతో దర్శకుడు రావిపూడి ఈ వార్తలపై స్పందిస్తూ ‘నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే నేనే స్వయంగా చెబుతాను. నేనింకా ఇంకా హీరోలకి కథ చెప్పాల్సి ఉంది. ఎలాంటి రూమర్లను నమ్మొద్దు’ అంటూ కొట్టిపారేశారు. మరి ఆయన ఏ హీరోకి కత చెప్పేను ఒప్పిస్తారో, అది ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకా కొంత సమయం ఎదురుచూడాల్సిందే. కమర్షియల్ అంశాలనే ఆధారంగా చేసుకుని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లను అందించే అనిల్ రావిపూడి గతంలో ‘పటాస్, సుప్రీం’ వంటి హిట్లను అందించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook