అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘కుకూన్స్’ పోస్టర్ విడుదల

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘కుకూన్స్’ పోస్టర్ విడుదల

Published on Oct 2, 2026 8:00 PM IST

జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుకూన్స్’. మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.

​న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

​పోస్టర్ కొత్తగా ఉందని, దర్శకుడు మహేశ్ గౌరి ఆలోచనలు ఇందులో కనిపిస్తున్నాయని అనిల్ రావిపూడి అన్నారు. గతంలో ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి మెంటార్‌గా వ్యవహరించిన వికాస్ ఈ చిత్రంతో నటుడిగా పరిచయమవుతున్నారని చెబుతూ, చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ చిత్రానికి బి.ఎన్.ఆదిత్య సంగీతం అందిస్తుండగా, నిఖిల్ శ్యామ్ సినిమాటోగ్రఫీ, ఆదిత్య తివారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు