అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో అతనే !
Published on Oct 25, 2017 6:03 pm IST

పటాస్ సినిమాతో దర్శకుడుడిగా మారిన అనిల్ రావిపూడి ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్’ తో ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని బాగా తీస్తాడనే పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ నితిన్ కు లైన్ చెప్పి ఒప్పించాడని సమాచారం. త్వరలో ఈ సినిమా అనౌన్స్ చెయ్యనున్నారు, ‘బెంగాల్ టైగర్’ చిత్ర నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చర్చల్లో ఉన్న ఈ సినిమాకు సంభందించి మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది. అంతేగాక అనిల్ రావిపూడి గతంలో బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిసిపోయింది.

ప్రస్తుతం నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని సమాచారం. ఈ మద్య నితిన్ చేసిన ‘లై’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోవడంతో నితిన్ తదుపరి సినిమాపై పూర్తి శ్రద్ధ చూపిస్తూ ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంలో ఉన్నారు.

 
Like us on Facebook