బాలీవుడ్ స్టార్స్‌కు సెంటిమెంట్‌గా మారిన ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి..!

బాలీవుడ్ స్టార్స్‌కు సెంటిమెంట్‌గా మారిన ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి..!

Published on Sep 4, 2021 4:00 PM IST


ఏదైనా ఒక సినిమా తీస్తున్నారంటే దాని కోసం కొన్ని శాఖలు పనిచేస్తుంటాయి. అయితే ఆయా శాఖల్లో పనిచేసే వారి పేర్లను సినిమా యొక్క టైటిల్ కార్డ్స్‌లో వేస్తారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టైటిల్ కార్డ్స్‌లోకి ఇప్పుడు ఆస్ట్రో కన్సల్టెంట్ అనేది కూడా చేరింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన హిట్ సినిమా ‘షేర్షా’లో ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి పేరు టైటిల్ కార్డ్‌లో పడింది. ‘షేర్షా’ నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గతంలో ఒకసారి జ్యోతిషం పరంగా తనకు సలహాలు ఇస్తూ, మద్దతుగా నిలుస్తున్నందుకు బాలు మున్నంగికి థాంక్స్ చెప్పారు. దీంతో అసలు ఎవరీ బాలు మున్నంగి అన్న చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ‘బాలు మున్నంగి’కి ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమారాలజీలలో ఇరవై మూడేళ్ల సుదీర్ఘ అనుభవముంది. బాలీవుడ్ స్టార్స్ కరణ్ జోహార్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా,’షేర్షా’ దర్శకుడు విష్ణువర్థన్ మొదలుకుని పలువురు హిందీ సినిమా ప్రముఖులకు బాలు మున్నంగి ఇప్పుడు సెంటిమెంట్‌గా మారిపోయాడు. సినిమా ప్రారంభోత్సవాలు, పనులకు ఆయన చేత ముహూర్తాలు పెట్టించుకుని ముందడుగు వేస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘తానాజీ’ చిత్రానికి కూడా బాలు మున్నంగి పెట్టిన ముహూర్తాలనే ఫాలో అయ్యారు. ‘తానాజీ’ తర్వాత ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ చేస్తున్న దర్శకుడు ఓం రౌత్ సైతం బాలు మున్నంగిని ఫాలో అవుతున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వదేశీ, విదేశీ రాజకీయ నేతలు కూడా బాలు మున్నంగి జోస్యాన్ని గట్టిగా నమ్ముతున్నారు. ‘బాలు మున్నంగి ప్రిడిక్షన్స్ అన్ రియల్’ అంటూ ఆయన సన్నిహిత మిత్రుడు, హీరో అజయ్ దేవగణ్ చెబుతుంటే, ఆయన చెప్పినవి ఫాలో అవడం వల్ల తనకొచ్చిన క్యాన్సర్ కూడా నయమైందని సంజయ్ దత్ చెప్పారు. వీరే కాకుండా రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ సైతం బాలు మున్నంగిని ఫాలో అవుతుండడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్, లైబీరియా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి మెక్ డెల్లా కూపర్ లాంటి విదేశీ రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను ఇన్‌స్టాలో ఫాలో అవుతూ సలహాలు సూచనలు తీసుకోవడం విశేషం. ఇక పలువురు తెలుగు ప్రముఖులు సైతం బాలు మున్నంగిని గట్టిగానే ఫాలో అవుతున్నారు.

సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వ్యక్తిగతంగా బాలు మున్నంగి సలహాలు తీసుకుంటున్నారు. ఇంతమంది దేశ, విదేశాల ప్రముఖులు ఆయన చెప్పే విషయాలతో ఏకీభవిస్తూ అనుసరిస్తున్నారంటే బాలు మున్నంగిని చూసి తెలుగు వారిగా మనం గర్వపడాలనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు