ప్రస్తుతానికి “భీమ్లా నాయక్” రిలీజ్ పై ఎలాంటి మార్పు లేదు.?

Published on Jan 28, 2022 4:01 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మాస్ ఆడియెన్స్ సహా పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పట్ల మేకర్స్ ఆల్రెడీ ఒక డేట్ ని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఫిబ్రవరిలోనే 25వ తారీఖున మేకర్స్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ సినీ వర్గాల్లో ఈ సినిమాపై లేటెస్ట్ క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదట.

అనుకున్న సమయానికే రిలీజ్ చేయనున్నారట. అలాగే మరికొన్ని రోజుల్లో మళ్ళీ సినిమా నుంచి అప్డేట్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :